Site icon HashtagU Telugu

Manukranth Chennareddy : జనసేన పార్టీకి మరో కీలక నేత రాజీనామా..

Manukranth Chennareddy

Manukranth Chennareddy

కూటమి పొత్తు (NDA Alliance) వల్ల ఎవరికీ ఎంత ఉపయోగం ఉందో కానీ జనసేన పార్టీ (Janasena)కి మాత్రం తీవ్ర నష్టం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో అసలు ఆ పార్టీలో ఎవరు ఉండరు కావొచ్చు అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం పదేళ్లుగా పనిచేస్తూ వచ్చిన నేతలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుండి నిన్న , మొన్న చేరిన నేతలకు టికెట్లు ఇచ్చి చేతులు దులుపోకోవడం ఫై జనసేన శ్రేణులు , నేతలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ముఖ్యంగా పొత్తు పెట్టుకున్న దగ్గరి నుండి జనసేన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక టికెట్ల ప్రకటన తర్వాత పూర్తిగా డౌన్ అయ్యింది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కు జై కొట్టిన నేతలంతా ఇప్పుడు జై జగన్ అంటూ వైసీపీ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్న నేతలు కూడా పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జనసేన కీలక నేతలు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు, మామ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్‌ పితాని బాలకృష్ణ ,విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్‌ పోతిన మహేష్, పాముల రాజేశ్వరి వంటి వారు జనసేనకు రాజీనామా చేయగా, తాజాగా ఇప్పుడు మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జ్ మనుక్రాంత్ (Manukranth Chennareddy) జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

”వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశానని అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ నాకు అండగా నిలిచిన మీ అందరికి మరియు జనసేన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా నిర్ణయం ఎవరికైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి. ప్రతి ఒక్కరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను” అంటూ తన లేఖలో రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తీరు వల్లే ఇలా వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పొచ్చు.

Read Also : Terrorist Killed: ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం