Site icon HashtagU Telugu

AP Congress : ఏపీ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‌గా మాణికం ఠాగూర్‌

Manickam Tagore Telangana congress

Manickam Tagore Imresizer

క‌ర్ణాట‌క‌, తెలంగాణలో అధికారం చేప‌ట్టిన త‌రువాత కాంగ్రెస్ మిగ‌తా రాష్ట్రాలపై పోక‌స్ పెట్టింది. తాజాగా మ‌రో తెలుగు రాష్ట్రామైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కాంగ్రెస్ ఫోక‌స్ పెట్టింది. ఏపీలో కాంగ్రెస్ గ‌త ప‌దేళ్లుగా ఎన్నిక‌ల్లో ఎక్క‌డా ప్ర‌భావం చూప‌డం లేదు. విభ‌జ‌నకు కాంగ్రెస్‌యే ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే ముద్ర ఇప్ప‌టికి ఉంది. దీంతో ఆ పార్టీ ఏపీ ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీ చేయ‌డానికి కూడా అభ్య‌ర్థులు క‌రువైయ్యారు.తాజాగా తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టిన త‌రువాత ఏపీలో కూడా త‌మ పార్టీని ఉనికిలోకి తీసుకురావాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ యోచిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‌గా త‌మిళ‌నాడు ఎంపీ మాణికం ఠాగూర్‌ని నియ‌మించింది. కొన్నేళ్లుగా ఏపీ కాంగ్రెస్‌కి ఏఐసీసీ ఇంఛార్జ్‌గా ఎవ‌రులేరు. గ‌తంలో ఉమెన్ చాందీ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఈ ప‌ద‌వి ఖాళీగా ఉంది. తాజాగా ఈ ఖాళీని పూరిస్తూ.. విరుదునగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాణికం ఠాగూర్ ని నియ‌మించింది. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌లు వెలువడనున్న తరుణంలో ఆయ‌న్ని ఇంఛార్జ్‌గా ఏఐసీసీ నియ‌మించింది. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజ, సీనియర్ సభ్యులు సుంకర పద్మశ్రీ, కొలనుకొండ శివాజీలు ఠాగూర్ నియామకాన్ని ఘనంగా స్వాగతించారు. మాణికం ఠాగూర్ నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని వారు ఆశ‌భావం వ్య‌క్తం చేశారు.

Also Read:  Covid Positive Cases : వైజాగ్‌లో ప‌దికి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు