Site icon HashtagU Telugu

tdp : అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలుః నారా లోకేశ్‌

Mangalagiri Lokesh election assurance

Mangalagiri Lokesh election assurance

Nara Lokesh: టీడీపీ(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంగళగిరి(Mangalagiri) మండలం కాజాలోని ఏఆర్‌ అపార్టుమెంట్‌ వాసులతో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అపార్టుమెంట్‌ వాసులు పలు సమస్యలను లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామని తెలిపారు.

Read Also: Everest – MDH : ఎవరెస్ట్, ఎండీహెచ్‌లకు షాక్.. మసాలా ఉత్పత్తులపై మరో బ్యాన్

మరోవైపు లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి కూడా ఇటివల మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. తన భర్త లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు.

యర్రబాలెం గ్రామంలో సంధ్యా స్పైసెస్ వద్ద మహిళా గ్రూపుల సభ్యులను కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ తయారయ్యే మసాలా పొడులను పరిశీలించారు. సంస్థ నిర్వాహకులను అడిగి వాటి వివరాలు తెలుసుకున్నారు.

Read Also:Passenger Attack : డ్రైవర్ ఫై ప్రయాణికుడి దాడి..చర్యలు తీసుకోవాలంటూ డ్రైవర్ల ఆందోళన 

అంతేకాదు, మిరపకాయలు వలిచి ఉపాధి పొందుతున్న మహిళలతో నారా బ్రాహ్మణి ముచ్చటించారు. గతంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు తమకు భోజనానికి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నామని వారు బ్రాహ్మణికి వివరించారు. ఈ విషయాన్ని నేను తప్పకుండా లోకేశ్ సార్ కు చెబుతాను అని బ్రాహ్మణి బదులిచ్చారు.