Mangalagiri: మంగళగిరిలో గెలుపు ఎవరిది? క్లియర్ కట్ అనాలసిస్..!

%%excerpt%% మంగళగిరిలో ఎవరు గెలుస్తారనే దానిపై.... హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేకుండానే ఎమ్మెల్సీ నామినేషన్‌తో ఏకంగా మంత్రి అయ్యారు లోకేష్. ఎక్కడి నుండి బరిలో నిలబట్టాలని బాబు తీవ్రంగానే కసరత్తు చేశారంట. సుదీర్ఘ లెక్కల అనంతరం మంగళగిరిని ఎంపిక చేశారు.

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 06:14 PM IST

Mangalagiri: ప్రతిపక్షంలో ఆయనో కీలక నేత…! మాజీ సీఎం కొడుక్కూడా…! అనూహ్య పరిణామాలతో… పార్టీకి మెయిన్ పిల్లర్ అవ్వడమే కాకుండా… పలు కీలక పదవులు కూడా అనుభవించారు. ఆయనకేమో… అప్పటి వరకు అస్సలు రాజీకాయాలే తెలీదు. కట్ చేస్తే… ఎమ్మెల్సీ పదవిచ్చి..మంత్రిని కూడా చేసేసారు. ఆయనకున్న అవగాహనతో… ఇటు ఎమ్మెల్సీగా…అటు మంత్రిగా.. భేష్ అనే అనిపించినప్పటికీ… ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదనే అసంతృప్తి మాత్రం…ఆయన్ను ఇప్పటికీ కలిచివేస్తోంది. అప్పట్లో… రాజకీయాల్లో కాకలుతీరిన ఘనులు…ఆయన్ని ఒక ఆటాడేసుకునేవాళ్లు. ఎవరెంత టార్గెట్ చేసినా…ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు..! వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాను గెలిచి… పార్టీని కూడా విజయపథంలోకి తీసుకెళ్లాలని పాదయాత్ర కూడా చేశారు…! మరి ఇన్ని తలొంపుల్ని తట్టుకుని మహా పాదయాత్ర చేపట్టిన నాయకుడెవరు..? ఎందుకాయన.. ఈసారి ఎలక్షన్స్‌ని అంత సీరియస్‌గా తీసుకున్నారు..? పార్టీ గెలవడానికా…లేక ఆయన గ్రాఫ్ పెంచుకోడానికా…?

లోకేశ్ ప్రస్థానం:
నారా లోకేశ్(Nara Lokesh)…విభజన తర్వాత ఏపీకి మొట్టమొదటి ఐటీ(It Minister) శాఖ మంత్రి. 1983 జనవరి 23 న..జన్మించారు. స్టాన్‌ఫర్డు యూనివర్సిటీ(Stanford University) నుంచి MBA పూర్తి చేసి అక్కడే సాఫ్ట్‌వేర్ జాబ్ (Software Proffesional) కూడా చేసారు. తండ్రి,మామయ్య, తాత…ఇలా కుటుంబం అంతా… ప్రజాక్షేత్రానికి చాలా దగ్గరగా ఉన్నారు. దీంతో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో… ప్రత్యక్ష రాజకీయాల్లో చేరారు. యాక్టివ్ పొలిటీషియన్‌గా మారినప్పటి నుంచీ…ప్రజలకు దగ్గర అవ్వాలనే తాపత్రయ పడ్డారు. మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గం నుంచీ 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. నాన్న అడుగుజాడల్లో నడుస్తూ…రాజకీయం నేర్చుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన ఆయన్ను…మొదట్లో తెలుగు ప్రజలు… అంతగా రిసీవ్ చేసుకోలేదనేది అందరికీ తెలిసిన వాస్తవం. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు… ఎన్నికల్లో ఓడిపోవడం తర్వాత… ఆయన పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మారుతున్నారు. ఇప్పుడిప్పుడే మెళుకువలు తెలుసుకుంటూ…పాదయాత్ర కూడా పూర్తి చేసి…ఏపీ రాజకీయాల్లో తన మార్క్‌ని క్రియేట్ చేసుకున్నారు.

టీడీపీ అనుకూలతలు:

రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత.. లోకేశ్‌ (Lokesh) ఇంత సుదీర్ఘ రాజకీయ యాత్రను చేపట్టడం మొదటిసారి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదేళ్ల క్రితం రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన… గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష పాత్రలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు… పాదయాత్రను ఎంచుకొన్నారు లోకేశ్. పాదయాత్రలో… మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని వారి నియోజకవర్గాల్లోనే ఎండగడుతూ… టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు నారా లోకేశ్. మండుటెండలను సైతం లెక్కచేయకుండా… దాదాపుగా అన్నీ నియోజకవర్గాలను కవర్ చేసారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు చాలా కీలకంగా మారాయి…అందులో మంగళగిరి నియోజకవర్గం ఒకటి. దీంతో…ఈ నియోజకవర్గంపై అందరి చూపు నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా నారా లోకేశ్….మంగళగిరి బరి నుంచే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నిలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత… కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది.

చంద్రబాబు వ్యూహం:

మంగళగిరిలో (Mangalagiri) ఎవరు గెలుస్తారనే దానిపై…. హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేకుండానే ఎమ్మెల్సీ నామినేషన్‌తో ఏకంగా మంత్రి అయ్యారు లోకేష్. ఎక్కడి నుండి బరిలో నిలబట్టాలని బాబు తీవ్రంగానే కసరత్తు చేశారంట. సుదీర్ఘ లెక్కల అనంతరం మంగళగిరిని ఎంపిక చేశారు. ఇక్కడ బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండటం…. అమరావతి రాజధాని కావడంతో.. మంగళగిరి అభివృద్ధి చెందిందనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంది. మంగళగిరికి ఐటీ కంపెనీలు రావడంతో పాటు, అభివృద్ధి పనులు టీడీపీకి కలిసి వస్తాయనే భావనలో ఉన్నారు. లోకేశ్‌ పోటీ చేస్తే.. మంగళగిరి వాసులు.. ఓట్లతో ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతున్నారు టీడీపీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల లెక్కలు కూడా చూశారు. గతంలో ఇక్కడి నుండి పోటీ చేసిన టీడీపీ క్యాండిడేట్… కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారంటే…ఇక్కడ టీడీపీకి వైసీపీగానీ వామపక్షాలు గానీ ఇచ్చే ఫైట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లోకేష్ గెలుపుకోసం బాబు పక్కా వ్యూహాలు రచించారనే చెప్పాలి.

వైసీపీ తప్పులు:

ఇక వైసీపీ విషయానికి వస్తే… అక్కడ ఎమ్మెల్యేగా 2014 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డే (Alla Ramakrishna Reddy) ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం…వైసీపీ నుంచి మురుగుడు లావణ్యని బరిలోకి దింపారు జగన్. వైసీపీ సైతం మంగళగరిలో మళ్లీ గెలిచేందుకు…ఎన్నో ప్లాన్‌లు వేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నేత గంజి చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకొని.. రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా…. ఆయన్ను నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లని పక్కనబెట్టి…. చేనేత వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. చేనేత కార్మికులతోపాటు…. బీసీలు మరోసారి తమ వెంట నడిస్తే.. మరోసారి లోకేశ్‌ను ఓడిస్తామని వైసీపీ మాంచి ధీమాతో ఉంది. ఐతే…. వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు (Ycp Mlc Murugudu HanmanthRao) కోడలే…ఈ మురుగుడు లావణ్య (Murugudu Lavanya). మురుగుడు హనుమంతరావు…. 1999, 2004ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున… మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక…. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ఆయన పని చేశారు. 2009లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన.. కాండ్రు కమలకు లావణ్య స్వయానా తల్లి.

ఎవరివి ఎన్ని ఓట్లు:

మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు, ముస్లింల ఓట్లు అధికం… వీరే కీలకం కానున్నారు. ఎటు వైపు మొగ్గు చూపితే… ఆ అభ్యర్థి విజయమనే లెక్కలు కూడా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గం… 1952 లో ఏర్పడింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కమ్యునిస్టు పార్టీ నేత దర్శి లక్ష్మయ్య విజయం సాధించారు. ఇప్పటివరకు ఇక్కడ కమ్యునిస్టులు నాలుగు సార్లు విజయం సాధించగా… కాంగ్రెస్ ఐదు సార్లు రెండు సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ విజయం సాధించాయి. 1985లో టీడీపీ నుంచి కోటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ గెలవలేదు. ఈ నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువ. దాదాపు లక్ష ఓట్లు చేనేతల చేతుల్లోనే ఉన్నాయ్. చేనేతల తర్వాత…కాపుల ఓట్లు ఎక్కువ. వామపక్షాలు భలంగా ఉన్నా.. మొదట్నుంచీ… చేనేత వర్గానికి సంబంధించిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే కంటే ముందు…కమల, హన్ముంతరావు, గోలి వీరాంజనేయులు… ఇలా అందరూ చేనేత వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. క్రమక్రమంగా వామపక్షాలు ఇక్కడ మద్దతు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ… గత ఎన్నికల్లో ఆర్కే తన సమీప అభ్యర్ధి నారా లోకేశ్ పై.. ఐదు వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. మరోసారి ఆధిపత్యం చూపించుకోవాలని వైసీపీ చూస్తుంటే…ఓడిన చోట ఎలాగైనా గెలవాలని తెగ తహతహలాడుతున్నారు.

అనుకూలతలు:

అప్పట్లో లోకేశ్ పాదయాత్రలో బిజీగా ఉన్నా… ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు…తన నియోజకవర్గానికి ప్రాముఖ్యతనివ్వడం… ప్రజల సమస్యలు తెలుసుకోవడం లాంటివి చేసారు. ప్రతిపక్షమే ఇంత చేస్తుంటే…అధికార పక్షం ఊరుకుంటుందా చెప్పండి…. వాళ్లు కూడా నాలుగు ఆకులు ఎక్కువే చదివారు కాబట్టి… నియోజకవర్గంలో ఓటర్లను బాగానే ప్రభావితం చేసారనే చెప్పాలి. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం… లోకేశ్‌లో కాస్తంత ధీమా పెరిగింది. ఐతే… సమాజిక వర్గాల సమీకరణాలు…. జగన్ సంక్షేమ పథకాలు… కలిసి వస్తాయని భావిస్తున్నారట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి లావణ్య. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు…APCRDA ఏర్పాటు చేశారు. ఆ రాజధాని ప్రాంతం ఎక్కువ భాగం మంగళగిరిలోనే ఉంది. విజయవాడ-గుంటూరు, విజయవాడ-మంగళగిరి మధ్య రాకపోకలకు మంగళగిరే ప్రధానంగా ఉంది. దీనికి తోడు.. రాజధానికి భూములిచ్చిన వారంతా ఇదే నియోజకవర్గానికి చెందినవారు. వాళ్ల ఓట్లన్నీ లోకేశ్‌కు పడితే… టీడీపీకి ఇక్కడ తిరుగు ఉండదని… గత ఎన్నికల్లోనే భావించినా… అలా జరగలేదు. అన్నింటికీ మించి… టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత…రాజధానిగా అమరావతిని చేసినా… నేషనల్ హైవే మంగళగిరిలోనే ఉంది. భూముల రేట్లు ఇక్కడ బాగా పెరిగాయ్. రియల్ ఎస్టేట్ కూడా బాగా ఊపందుకుంది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ మంగళగిరిలోనే ఉన్నాయ్. దాంతో పాటు…రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌తో పాటు…బీజేపీ, జనసేన, ఎయిమ్స్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే కొలువు తీరాయి. దీని వల్ల అక్కడి ప్రజల భూములకు.. టీడీపీ హయాంలో మంచి రేటు వచ్చింది. ఇవన్నీ గెలిపిస్తాయని నమ్మి….లోకేశ్ బోల్తా పడ్డారు.

రాజధాని మార్పు:
ఐతే జగన్ రాజధానిని మార్చడం.. ఇక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉండటం… అమరావతి పోరాటం కలిసి వస్తాయని లోకేశ్ గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాదు… తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే… అభివృద్ధి మరింతగా జరుగుతుందని… లోకేశ్ హామీలిస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు మూడు దఫాలు మంగళగిరి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు లోకేశ్. ప్రతి గడపకు వెళ్లీ…గెలిపించాలని కోరుతున్నారు. 2014 టీడీపీ వేవ్‌లో కూడా… మంగళగిరి నుంచీ ఎమ్మెల్యే ఆర్కే విజయబావుటా ఎగురవేసారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. నాలుగు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమం మంగళగిరిలో చేపట్టడం… అన్నింటికీ మించి… అమరావతి భూముల కేసులో టీడీపీకి చుక్కలు చూపించారు. ఈ పరిణామాలతో ఆర్కే ఇమేజ్ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడ పెరిగిన ఇమేజ్…లావణ్యకు డైవర్ట్ అవుతుందని వైసీపీ లెక్కలు వేస్తోంది. అదే… 2019 ఎన్నికల్లో బాగా కలిసి వచ్చింది. ఐతే ఈసారి మాత్రం పరిస్థితి మారిందనే చెప్పాలి. రాజధాని ప్రాంతం తమకు దూరం అవుతుందని.. అక్కడి ప్రజల్లో బలమైన సెంటిమెంట్ నెలకొని ఉంది. దీనికి తోడు… అప్పట్లో ఒక్కసారిగా పెరిగిన అక్కడి భూముల రేట్లు…ఇప్పుడు అమాంతం పడిపోయాయ్. సో..ఇలాంటి విషయాలను మాత్రం టీడీపీ మరోసారి అక్కడున్న ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేతే మాత్రం….లోకేశ్‌కి మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు:

ఇక్కడ వైసీపీ అభ్యర్ది లావణ్యకి బలహీనమైన అంశం ఏంటంటే….గతంలో పనిచేసిన ఎమ్మెల్యే ఆర్కే ప్రజలతో మమేకం అవ్వలేదు. అది కూడా ఈవిడకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే…ఈవిడకు అంత రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఆర్ధికంగా బలంగా ఉండటం…కాస్తంత కలిసొచ్చే అంశాలు. ఇప్పటికైనా… లావణ్య పార్టీ నేతలను అందరినీ కులుపుకుపోతే…ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తి కొంచెం అయినా తగ్గి… ఓట్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇటు నారా లోకేశ్ కూడా… ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే వెతుక్కోవాలి అన్న మాదిరిగా…పట్టు వదలని సాహసం చేస్తున్నారు. యువగళం ఎఫెక్ట్…ఇటు వైసీపీకి ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసొచ్చి..మంగళగిరిలో ఈసారి లోకేశ్ గెలిచినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఏదేమైనా….ఈసారి మాత్రం టఫ్ పైట్ ఉంటుందని చెప్పడంలో డౌటే లేదు. మరి విజయం ఎవర్ని వరిస్తుందో… వేచి చూడాల్సిందే…!