Site icon HashtagU Telugu

Manchu: పొలిటికల్ సిస్టర్స్ కు ‘మంచు’ తోడు! టీడీపీ లేదా జనసేన వేదిక రెడీ!!

Manchu To Political Sisters! Tdp Or Jana Sena Platform Ready!!

Manchu To Political Sisters! Tdp Or Jana Sena Platform Ready!!

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయ పెత్తనం కావాలని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చాలా కాలంగా కోరుకుంటున్నట్లు అందరికి తెలిసిందే. ఆ క్రమంలో ఏ వీ సుబ్బారెడ్డి తో కూడా డీ కొట్టి నానా హంగామా అప్పట్లో చేశారు. ఆ సమయంలో ఆమె సోదరి మౌనిక కూడా వాయిస్ కలిపారు. అంతే కాదు, హైదరాబాద్ ల్యాండ్ కేసులోని వాళ్లిద్దరి వాలకం చూసాం. రాబోవు రోజుల్లో మౌనిక, అఖిల ఇద్దరు నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తండ్రి నాగిరెడ్డి బతికున్న రోజుల్లో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్న మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కుటుంభంలోకి ఎంట్రీ పెళ్లి రూపంలో ఇచ్చారని టాక్.

భూమా ఫ్యామిలీ చాలాకాలంగా రాజకీయాల్లో ఉంది. సుదీర్ఘ కాలం టీడీపీ లో నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభ పనిచేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. తదనంతరం వైసీపీ పక్షాన నిలిచారు. ఇద్దరు మరణించే నాటికి తిరిగి టీడీపీలోకి వచ్చారు. వాళ్ళ రాజకీయ వారసత్వాన్ని అఖిల్స్ ప్రియ తొలి రోజుల్లో అందుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె వ్యక్తిగత జీవితం కొంత నెగటివ్ గా మారింది. ఆ సమయంలో తెరమీదకు వచ్చిన మౌనిక చాలా దుకుడుగా ఉన్నారు. ఒకానొక సమయంలో మీడియాలోకి ఎంట్రీ ఇస్తారని టాక్ వచ్చింది. టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత భూమా కుటుంబం రాజకీయ అనాధ గా మిగిలింది. మళ్ళి వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఎంట్రీ లేకపోవటంతో ప్రస్తుతం టీడీపీ లో ఉన్నారు. అయితే ఎక్కడా చురుగ్గా క్షనిపించటం లేదు.

ప్రజారాజ్యం వారసత్వంగా ఉన్స్ జనసేన వైపు ఇపుడు అఖిల , మౌనిక చూస్తున్నట్టు తెలిస్తుంది. టీడీపీ ఇద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మౌనిక ప్రత్యామ్నాయం మార్గాలను ఎంచుకుంటున్నారని తెలుస్తుంది. వాస్తంగా మంచు (Manchu), మెగా కుటుంబాలకు పెద్దగా సఖ్యత లేదు. అయినప్పటికీ పవన్ తో మనోజ్ కు మంచి సంబంధాలు ఉన్నట్టు టాలీవుడ్ టాక్. ఆ కోణంలో ఆలోచిస్తున్న పొలిటికల్ సర్కిల్స్ మౌనిక , మనోజ్ జంట వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తారని బలంగా నమ్ముతున్నారు. పైగా మోహన్ బాబు కూడా వాళ్లకు హెల్ప్ చేయదానికి వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీ వైపు స్వరం మార్చారని ఆయన పలు ఇంటర్వ్యూ లను ఫాలో అయ్యే వాళ్ళు చెప్పే మాట.

మనోజ్ కూడా గతంలో పలు రాజకీయ అంశాలపై స్పందించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచే అతను పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటున్నట్లుగా కథనాలు వచ్చాయి.ఇప్పుడు భూమా మౌనిక తో పెళ్లి జరగడంతో మంచు మనోజ్ (Manchu Manoj) ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంలో రకరకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉండడంతో మనోజ్ చాలా సింపుల్ గానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకు రెగ్యులర్ పొలిటిక్స్ లోకి వచ్చే ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేసాడు.ప్రజాసేవలో మాత్రం తను ఎప్పటిలాగే చాలా బిజీగా ఉంటాను అని కూడా మనోజ్ వివరణ ఇచ్చాడు. ఆ ఆలోచన విధానమే మా ఇద్దరినీ ఈరోజు ఒకటి చేసింది అని అయితే మౌనిక రాజకీయాల్లోకి వెళతాను అంటే తన ఇష్ట ప్రకారం వెళ్లినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.

మనోజ్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలంగా సింగిల్ గానే ఉంటున్నట్లు టాక్ వచ్చింది. అయితే తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆయన ఎక్కడగా బయట పెట్టలేదు. భూమా అఖిల ప్రియ సోదరి భూమా మౌనికతో ఆయన ప్రేమలో ఉన్న విషయం ఇండస్ట్రీలో అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ విషయాన్ని మనోజ్ అధికారికంగా పెళ్లి వార్తతో తెలియజేశారు. ఇక వాళ్ళ జీవితం దాదాపుగా రాజకీయ రంగం వైపు ఉంటుందని భూమా, మనోజ్ గురించి తెలిసిన వాళ్ళు చెప్ప మాట. అందుకు మంచు, భూమా కుటుంబాలు భారీ ప్లాన్ చేశాయని అభిమానుల్లో ని చర్చ.

Also Read:  Congress: పట్టణాల్లో కాంగ్రెస్ వీక్ , గ్రామాల్లో భేష్! లండన్ వేదికపై రాహుల్ లెక్క

Exit mobile version