Site icon HashtagU Telugu

Mohan Babu : మోడీకి సపోర్ట్‌గా మోహన్‌బాబు.. జగన్‌కు వ్యతిరేకంగా మనోజ్ కీలక వ్యాఖ్యలు

Mohan Babu

Mohan Babu

Mohan Babu : తిరుపతిలోని ఎంబీయూలో మంగళవారం రాత్రి జరిగిన నటుడు మోహన్ బాబు జన్మదిన వేడుకల్లోనూ రాజకీయ ప్రసంగాల హీట్‌ కనిపించింది. ఆయన కుమారుడు మనోజ్ కూడా పొలిటికల్ స్పీచ్‌‌ను దంచేశారు.నచ్చిన వారికి ఓటు వేసుకోండి అని చెబుతూనే.. ఎవరికి వేయాలనేది కూడా చెప్పేశారు. అయితే తమ ప్రసంగాల్లో ఎక్కడా రాజకీయ పార్టీల పేర్లు రాకుండా జాగ్రత్తపడ్డారు. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌ 32వ వార్షికోత్సవంతో పాటు మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలను మంగళవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు మోహన్ లాల్, ముఖేష్ రుషి పాల్గొన్నారు. ఈసందర్భంగా మోహన్ బాబు, మనోజ్ చేసిన వ్యాఖ్యలేంటో చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం నచ్చిన వాళ్లకే వేయండి : మోహన్ బాబు

తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మోహన్ బాబు(Mohan Babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేను చాలా సందర్భాల్లో కలిశాను. అలాంటి ఆలోచనలు, విధానాలు కలిగిన వ్యక్తి భారతదేశానికి అవసరం. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. ఇద్దరూ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మనవే.. లంచాలు తీసుకున్న డబ్బులు.. ఆ డబ్బులు తీసుకోండి. ఓటును మాత్రం నచ్చిన వారికే వేయండి. భారతదేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడానికి సహకరించండి’’ అని మోహన్ బాబు పిలుపునిచ్చారు. ఆయన బీజేపీకి మద్దతుగా మాట్లాడారనే విషయం ఆ వ్యాఖ్యలను బట్టి స్పష్టమైపోయింది.

డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి : మనోజ్

మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ‘‘పదిమందిని కలుపుకొని వెళ్లే లీడర్‌ని వెతుక్కోండి. వాళ్ల ఫ్యామిలీకే హెల్ప్‌చేయనివాళ్లు..  వాళ్ల చుట్టుపక్కల వాళ్లకే హెల్ప్ చేయనివాళ్లు మీకేం హెల్ప్‌  చేస్తారు. అది గుర్తుపెట్టుకొని కరెక్ట్‌గా నాయకుడిని చూజ్‌ చేసుకోండి.  మీకు, మీ ఏరియాలో ఉన్న పేదవాళ్లకు ఏ లీడర్ వస్తే సపోర్టివ్‌గా ఉంటుందో అనలైజ్ చేసి కరెక్ట్‌గా ఓటు వేయండి. డబ్బులు చూసి ఎవరికీ ఓటు వేయకండి. డబ్బు ఇస్తే థాంక్యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్లకే ఓటు వేయండి’’ అని కామెంట్ చేశారు.  మనోజ్ స్పీచ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరికనొకరు నిందించుకొని ఆ వీడియోను రెండు గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. జగన్‌ను మనోజ్‌ నేరుగా విమర్శించకపోయినా  టీడీపీకి సపోర్ట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మోహన్ బాబు మోడీకి, మనోజ్‌ టీడీపీకి సపోర్ట్ చేశారని అంటున్నారు. మొత్తానికి తండ్రీకుమారులు ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Also Read :Agnibaan : మన స్పేస్ స్టార్టప్ విప్లవం.. మార్చి 22నే ‘అగ్నిబాణ్’ ప్రయోగం

Also Read :MNP : ‘సిమ్ స్వాప్’ మోసాలకు చెక్.. ‘మొబైల్ నంబర్ పోర్టింగ్’ ​కొత్త రూల్

Exit mobile version