మంచు మనోజ్(Manchu Manoj ) తన భార్య మౌనికతో కలిసి జనసేన పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. నంద్యాల జిల్లాలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల(Shobha Nagireddy birth Anniversary Celebrations) సందర్భంగా ఈ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కుటుంబ అంతర్గత విభేదాలతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఈ నిర్ణయం ద్వారా తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలకబోతున్నారని చెబుతున్నారు.
మంచు ఫ్యామిలీ గతంలో వైసీపీ(YCP)లో చేరి 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చినా, ఆ తరువాత ఆ పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మంచు విష్ణుతో మంచు మనోజ్‌కు తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. ఈ వివాదాలు కోర్టు, మీడియా వరకు వెళ్లడంతో, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని మనోజ్ పేర్కొనడం పెద్ద సంచలనం రేపింది. మంచు మనోజ్ రాజకీయ ప్రవేశం వెనుక శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబ స్ఫూర్తి ఉందని భావిస్తున్నారు. అఖిల ప్రియ రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటికీ, మనోజ్ తనదైన మార్గంలో జనసేనలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది కూడా కుటుంబ విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మంచు ఫ్యామిలీకి రాజకీయ అనుభవం ఉందనే విషయం తెలిసిందే. అయితే, ఆ కుటుంబంలోని పలువురు ఇప్పటికే బీజేపీ, టీడీపీ పార్టీలతో అనుబంధం కలిగి ఉండగా, మనోజ్ దంపతులు జనసేనలో చేరడం విశేషం. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ పార్టీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో నంద్యాల బయలుదేరడం ఆసక్తి రేపుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం మంచు మనోజ్ దంపతులు జనసేనను ఎంచుకోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది.
Read Also : Balakrishna : కోట్లు ఇస్తామన్న బాలకృష్ణ ఆ పని చేయలేదట