Site icon HashtagU Telugu

Who Is Vinay: మంచు ఫ్యామిలీ రచ్చలో వినయ్ ఎవరు?

Who Is Vinay

Who Is Vinay

Who Is Vinay: మంచు మోహ‌న్ బాబు.. క్ర‌మశిక్ష‌ణ‌కు మారు పేరు అంటుంటారు. అయితే గ‌త రెండు రోజుల నుంచి జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఆయ‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసే విధంగా ఉన్నాయి. తొలుత మ‌నోజ్‌పై మోహ‌న్ బాబు దాడి చేశార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌నోజ్ ఆస్ప‌త్రికి రావ‌డం మెడ‌కు ప‌ట్టీతో తిరిగి ఇంటికి వెళ్ల‌డం జ‌రిగిపోయింది. అయితే సోమ‌వారం సాయంత్రం కొడుకు మీద తండ్రి మీద రాచ‌కొండ క‌మిష‌న‌ర్‌కు లేఖ రాయ‌డం, మ‌నోజ్ ఎక్స్ వేదికగా అస‌లు విష‌యాన్ని చెప్ప‌డంతో వివాదం ఏంటి అనేది బ‌య‌టికి వ‌చ్చింది. అయితే ఈ వివాదంలో ఎక్కువ‌గా విన‌య్ (Who Is Vinay) అనే వ్య‌క్తి పేరు వినిపిస్తుంది. ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అయిన ఈ విన‌య్‌కు.. మంచు ఫ్యామిలీ గొడ‌వ‌కు లింక్ ఏంటీ అనేది మాత్రం ప్ర‌స్తుతం మిలియ‌న్ డాల‌ర్ల క్వ‌శ్చ‌న్ మార్క్‌గా మిగిలిపోయింది.

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచి ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది. అసలు ఎవరు ఈ వినయ్ అని ఆరా తీయగా.. అతను మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్‌గా వ్యవహరిస్తున్నారు. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి. ఆయన గతంలో 2019 నుండి 2022 వరకు సాక్షి మీడియా సంస్థల సీఈవోగా పనిచేశారు. అనంతరం కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈవోగా విధులు నిర్వహించారు.

Also Read: Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మ‌నోజ్‌

ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీ తో పాటు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (నిర్మాణ సంస్థ) మేనేజింగ్ పార్ట్‌న‌ర్‌గా, Sucstrat Consulting Private Limitedకి మేనేజింగ్ డైరెక్టర్ క‌మ్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతను నెలలో ఒకటి, రెండు రోజులు తిరుపతి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉంటూ.. మిగిలిన సమయం అంతా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్ నగరాల్లో ఉంటాడని అతని సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కూడా ఇతను కలవడానికి నిరాకరించిన‌ట్లు స‌మాచారం.

విన‌య్‌పై మోహ‌న్ బాబు తిట్ల పురాణం

కొన్ని మీడియా క‌థ‌నాల ప్ర‌కారం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్‌గా ఉన్న విన‌య్‌పై కొన్ని విష‌యాల్లో మోహ‌న్ బాబు తిట్ల పురాణం అందుకున్నార‌ని, ఇదే విష‌యాన్ని విన‌య్ మంచు విష్ణు, మ‌నోజ్‌ల‌కు చెప్పిన‌ట్లు రాసుకొచ్చారు. అయితే విష్ణు అందుబాటులో లేక‌పోవ‌డంతో మ‌నోజ్ ఇదే విష‌యాన్ని అడ‌గ‌టానికి తండ్రి ద‌గ్గ‌ర‌కి వెళ్లితే అక్క‌డ గొడ‌వ జ‌రిగిన‌ట్లు క‌థ‌నాలు పేర్కొన్నాయి.