Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్‌ పోసి నిప్పు

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

Published By: HashtagU Telugu Desk
Andhrapradesh

Resizeimagesize (1280 X 720) (2) 11zon

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలతో పాటు సమీపంలో నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకున్నాయి.

ఎల్లనూరు మండలం వేములపల్లెకు చెందిన నల్లపురెడ్డి, కృష్ణవేణమ్మ గత కొన్నేళ్లుగా తాడిపత్రి పరిధిలోని సజ్జలదిన్నె వద్ద ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే పరిశ్రమలో పనిచేస్తున్న వీరి సమీప బంధువు రమేశ్‌రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. దీనిపై నల్లపురెడ్డి గత మూడు రోజులుగా మందలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్న నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులపై రమేశ్‌రెడ్డి పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. దంపతులతో పాటు అక్కడే నిద్రిస్తున్న పూజిత అనే బాలికకూ కూడా మంటలు అంటుకున్నాయి.

Also Read: Hyderabad : పాత‌బ‌స్తీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఆస్తి వివాదంపై రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

దంపతులకు తీవ్ర గాయాలు కాగా.. బాలిక స్వల్పంగా గాయపడింది. గమనించిన స్థానికులు భార్యాభర్తలను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూలుకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల వాంగ్మాలం సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  Last Updated: 18 Jun 2023, 11:29 AM IST