Site icon HashtagU Telugu

Heart Attack: గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి.. వీడియో వైరల్..!

Heart Attack

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Heart Attack: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటు (Heart Attack)తో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. వినాయక చవితి సందర్భంగా మండపంలో ప్రసాద్ తన తోటి యువకులతో కలిసి డాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పడిపోవడంతో స్థానికులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ధర్మవరంలో విషాధ చాయలు అలుముకున్నాయి. గుండె పోటుతో ఇటీవల కాలంలో పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు చాలా మంది చనిపోతున్నారు. ఉత్సాహంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తోంది.

Also Read: AP Assembly : బాలకృష్ణ .. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్

తెలంగాణలో గుండెపోటు ఘటనలు

తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 14 ఏళ్ల విద్యార్థి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరవుతుండగా ఛాతీ నొప్పితో ఫిర్యాదు చేశాడు. పాఠశాల ఉపాధ్యాయులు అతడిని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు. పరీక్షించిన డాక్టర్స్ గుండెపోటుతో బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

రెండు నెలల క్రితం జరిగిన మరో ఘటనలో గుండ్ల పోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో 46 ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ చనిపోయాడు. రామాంతపూర్ ప్రాంతంలోని ఓ ప్లేగ్రౌండ్‌లో కొందరు స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతూ కె.కృష్ణా రెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

Exit mobile version