Eluru : అతడు దీపావళి వేళ పండుగ సెలబ్రేషన్స్ కోసం బాణసంచా కొనుక్కున్నాడు. దాన్ని తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో బైక్‌పై ఉన్న బాణసంచా బస్తా కిందపడగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సదరు వాహనదారుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని సుధాకర్‌గా గుర్తించారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి.
Also Read :Beauty Tips: ప్రతిరోజు జుట్టుకు షాంపూ అప్లై చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధాకర్ తీసుకెళ్లిన ఆ బాణసంచా బస్తాలో ఉల్లిపాయ బాంబులు ఉన్నాయని తేలింది. బాణసంచా పేలుడు సంభవించడంతో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :firecrackers : ఆ పటాకాయలు కాల్చొద్దు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
ఈ జాగ్రత్తలు పాటించండి..
- బాణసంచా కాల్చే సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. భారీ శబ్దాలు చేసే టపాసులు కాల్చకుంటేనే బెటర్.
- బాణసంచా కాల్చే టైంలో సిల్క్ వంటి తేలిగ్గా మంటలు అంటుకునే బట్టలు ధరించకూడదు. మందంగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సేఫ్.
- ఎలక్ట్రికల్ దీపాలు ఏర్పాటు చేసిన చోట కూడా మనం కొంత అలర్ట్‌గా ఉండాలి.
- బాణసంచాను కొంత దూరం నుంచి కాల్చాలి.
- ఒకవేళ కాలిన గాయాలైతే వాటిని నీటితో కడగండి. వాటికి సమీపంలోని వైద్యులతో ప్రథమ చికిత్స చేయించుకోండి.
- టపాసుల వల్ల వచ్చే పొగ, కాలుష్యం వల్ల కళ్లు పొడిబారుతాయి. కొన్ని సార్లు కళ్లకు గాయాలవుతుంటాయి.