Makineedi Seshu Kumari : జనసేన పార్టీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా

పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేన కు రాజీనామా చేసారు. జనసేనలో సీనియర్‌ నేతగా ఉన్న ఆమె.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు

Published By: HashtagU Telugu Desk
Makineedi Seshu Kumari

Makineedi Seshu Kumari

ఏపీలో రాజకీయాలు కాకమీద ఉన్న క్రమంలో జనసేన పార్టీ (Janasena Party) కి భారీ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి (Makineedi Seshu Kumari) జనసేన పార్టీ కి రాజీనామా చేసారు. మరో ఆరు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలా పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ – టీడీపీ (Janasena-TDP) తో కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి కార్యాచరణ చేపడుతున్నాయి. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృష్ణ జిల్లాలో వారాహి యాత్ర ను విజయవంతంగా పూర్తి చేసారు. ఈసారి జగన్ (jagan) ను గద్దె దించబోతున్నామని , రాబోయేది జనసేన – టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే అని చెపుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది.

We’re now on WhatsApp. Click to Join.

పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి (Makineedi Seshu Kumari resign janasena party) జనసేన కు రాజీనామా చేసారు. జనసేనలో సీనియర్‌ నేతగా ఉన్న ఆమె.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆమె పార్టీ లోనే కొనసాగుతూ..పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. మూడు నెలల క్రితం పిఠాపురం ఇంఛార్జి బాధ్యతల నుంచి ఆమెను తప్పించింది జనసేన అధిష్టానం. దీంతో మనస్థాపానికి గురైన మాకినీడి శేషుకుమారి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈమె ఏ పార్టీ లో చేరతారనేది చూడాలి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. వారం రోజుల పాటు ఆయన్ను రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు.

Read Also : vijayashanthi : బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు – విజయశాంతి

  Last Updated: 11 Oct 2023, 02:14 PM IST