AP Politics: ముగ్గురి ముచ్చ‌ట‌, ఎవ‌రి పంథా వాళ్ల‌దే.!

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకోవ‌డం స‌హ‌జం. ఏపీ రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల చీఫ్ ఎవ‌రికి వారే క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌డానికి బ్లూ ప్రింట్ ను త‌యారు చేసుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 01:09 PM IST

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకోవ‌డం స‌హ‌జం. ఏపీ రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల చీఫ్ ఎవ‌రికి వారే క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌డానికి బ్లూ ప్రింట్ ను త‌యారు చేసుకుంటున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే ప్ర‌జాద‌ర్బార్ ను తెరవ‌బోతున్నారు. దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హాలో తాడేప‌ల్లి ప్యాలెస్ కేంద్రంగా ద‌ర్బార్ నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆనాడు వైఎస్ నిర్వ‌హించిన ర‌చ్చ‌బండ‌ను శాశ్వ‌తంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌దిలేసిన‌ట్టేన‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

జ‌న‌సేనాని ప‌వ‌న్ అక్టోబర్ 5 విజయదశమి నుంచి బస్సు యాత్ర మొదలెట్టి ఏపీ అంతటా ఒక రౌండ్ వేసే పనిలో ఉన్నార‌ట‌. అందుకే, ముందుగా అలెర్ట్ అయిన లోకేష్ న‌వంబ‌ర్ నుంచి పాదయాత్ర చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నికలు వ‌చ్చే ఏడాది ఉంటాయని టీడీపీ విశ్వ‌సిస్తోంది. అందుకే, లోకేష్ పాద‌యాత్ర‌కు బ్లూ ప్రింట్ ను రూపొందిచిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతవరకూ లోకేష్ పాద‌యాత్ర కొనసాగేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలైన నెల తరువాత లోకేష్ యాత్ర స్టార్ట్ అయ్యేలా స్కెచ్ సిద్ధం అయింది.

Also Read –  Amaravati Centre: అమ‌రావ‌తిపై ఒట్టు! బీజేపీ, జ‌నసేన దూరం!!

ఉమ్మ‌డి ఏపీలో తొలిసారిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 2004 ఎన్నిక‌ల‌కు ముందుగా పాద‌యాత్ర చేశారు. ఆ త‌రువాత ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు 2009 ఎన్నిక‌ల‌కు ముందుగా మీ కోసం యాత్ర బ‌స్సులో చేశారు. కానీ, ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాలేక‌పోయారు. దీంతో 2013 నుంచి వ‌స్తున్నా మీకోసం అంటూ పాద‌యాత్ర ను చేశారు. ఆయ‌న పాద‌యాత్ర‌లో ఉన్న‌ప్పుడే ఏపీ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన ఏపీకి చంద్ర‌బాబు సీఎం అయ్యారు. తెలంగాణ‌లోనూ 15 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నారు. అంటే, చంద్ర‌బాబు పాద‌యాత్ర ఫ‌లించింద‌న్న‌మాట‌.

విడిపోయిన ఏపీ రాష్ట్రానికి తొలి ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న 2018లో పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. మ‌ళ్లీ సీఎం అయిన త‌రువాత మాత్ర‌మే అసెంబ్లీలోకి అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేసి పాద‌యాత్ర‌కు వెళ్లారు. సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేల‌తో చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తూ సీఎం అయ్యారు. అంటే, పాద‌యాత్ర బాగా ప‌నిచేసింద‌ని అర్థం అవుతోంది. మొత్తం మీద ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ, విడిపోయిన ఏపీలోనూ పాద‌యాత్ర చేసే వాళ్ల‌కు ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన చ‌రిత్ర ఉంది.

Also Read – Rajagopal Reddy Vs Revanth Reddy: మునుగోడు మే సవాల్

పాద‌యాత్ర సెంటిమెంట్ ను న‌మ్ముకున్న లోకేష్ న‌వంబ‌ర్ నుంచి ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.వచ్చే ఏడాది పాద‌యాత్ర ఉంటుంద‌ని తొలుత అనుకున్నారు. కానీ, ప‌వ‌న్ బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌డానికి రెడీ అవుతున్న త‌రుణంలో లోకేష్ కూడా పాద‌యాత్ర‌ను ముందుకు జ‌రిపార‌ని వినికిడి. వాస్త‌వానికి ఈ ఏడాది ఆగ‌స్ట్ లేదా అక్టోబ‌ర్ 2 త‌రువాత పాద‌యాత్ర‌కు దిగాల‌ని లోకేష్ భావించారు. కానీ, ప‌రిస్థితుల ఆధారంగా ఆయ‌న యాత్ర‌ను షెడ్యూల్ ను స‌వ‌రించుకుంటూ వ‌స్తున్నారు.

మొత్తానికి ఎన్నిక‌ల సంద‌డి ఏపీలో అక్టోబ‌ర్ నుంచి బాగా ఊపందుకోనుంది. జ‌గ‌న్ ద‌ర్బార్‌, ప‌వ‌న్ బ‌స్సు యాత్ర, లోకేష్ పాద‌యాత్ర‌ల‌తో హ‌డావుడి మొద‌లు కానుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ షెడ్యూల్ కు అనుగుణంగా లోకేష్ పాద‌యాత్ర ఉంటుంద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. అంటే, జ‌న‌సేన వెంట లోకేష్ ప‌డుతున్నాడ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఒంగోలు మ‌హానాడు త‌రువాత జ‌న‌సేన‌తో పొత్తులేకుండా ఒంటరిగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీలోని లోకేష్ గ్రూప్ భావిస్తుంద‌ని తెలుస్తోంది. పైగా చంద్ర‌బాబు మినీ మ‌హానాడులు విజ‌య‌వంతం కావ‌డం కూడా టీడీపీ క్యాడ‌ర్ కు ఉత్సాహాన్ని ఇస్తోంది.

Also Read – గూగుల్ లో ఉన్నది ఎందరో.. పనిచేసేది కొందరే : సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు