Asaduddin Owaisi : చంద్రబాబును నమ్మలేం.. ప్రజలు కూడా నమ్మొద్దు : ఒవైసీ

Asaduddin Owaisi : టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mp Asaduddin Owaisi Women R

Mp Asaduddin Owaisi Women R

Asaduddin Owaisi : టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్  డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో హ్యాపీగా ఉన్నారని ఆయన కామెంట్ చేశారు. బాబు ఎందుకు జైలుకెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొన్నారు.  సీఎం జగన్ పాలన బాగుందని ఒవైసీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును నమ్మలేమని.. ప్రజలు కూడా నమ్మొద్దని ఆయన సూచించారు.

Also read : Bhadrapada Purnima 2023: భాద్రపద మాసంలో పౌర్ణమి తేదీ సమయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంఐఎం పని చేయాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మజ్లిస్ పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమైన సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై  చర్చించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌ కు సపోర్ట్ చెయ్యాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

  Last Updated: 26 Sep 2023, 01:54 PM IST