ఈ నెల 18న మహాశివరాత్రి (Mahashivratri) పర్వదినం నేపథ్యంలో, ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, వేదపండితులు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ మహాశివరాత్రి (Mahashivratri) బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఈ రాత్రి 7 గంటలకు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు.
దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి స్పందిస్తూ, బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అన్నదాన వసతి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులు భారీగా తరలి వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈవో లవన్న మీడియాతో మాట్లాడుతూ… 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ సాయంత్రం ధ్వజారోహణం ఉంటుందని వివరించారు.
Also Read: Aamir Khan vs Kangana: అమీర్ ఖాన్ పై కంగన ట్రోల్స్