Mahasena Rajesh : 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైన మహాసేన రాజేష్

తాజాగా ఆయన 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని చూస్తే సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది

Published By: HashtagU Telugu Desk
Mahasena Rajesh New Party

Mahasena Rajesh New Party

మహాసేన రాజేష్ రాజేష్ (Mahasena Rajesh ) సొంతగా పార్టీ (New Party) పెట్టబోతున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఆయన 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని చూస్తే సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సొంతగా పార్టీ ప్రకటించే ఛాన్స్ ఉండదు..సో ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఛాన్స్ ఉంది.

అసలు ఆయన చేసిన పోస్ట్ చూస్తే..

నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ని..రాష్ట్ర స్టీరింగ్ కమెటి మెంబర్ ని..SC (మాల)కి TDP రాష్ట్ర లీడర్ ని.. మా పార్టీ అధికారం లోకి రాగానే MLC OR STATE చైర్మన్ అవుతాను..
అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబు గారికి క్షమాపణ చెప్పి పార్టీ నుండి బయటకు రావడానికి సిద్ధం..
కారణం?
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం..
దేశమంతా ప్రతీ పార్టీకి ప్రతిపక్షం ఉంది..
గుజరాత్ లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు..
కానీ ఆంధ్రలో మాత్రం బీజేపీ కి ప్రతిపక్షం లేదు.. ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే..
ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీ కే పడుతుంది..ఇది రాజ్యాంగ విరుద్ధం.
బీజేపీ కి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు..

ఈ కారణంగా మేము 2024 ఎలక్షన్ లో మాకు అవకాశం ఉన్న ప్రతీ నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం..
ఇప్పటికీ దాదాపు 100నియోజకవర్గాలు సిద్ధమయ్యం..
ఇది పదవికోసం కాదు.. మా ఆత్మగౌరవం కోసం మాత్రమే..

మాతో కలిసి పోటీచేసి మీ నిరసన తెలియజేయాలనుకున్న “రాజులైన యాజక సమూహానికి(పాస్టర్లు).. చరిత్రలో దేశాన్ని పరిపాలించిన నవాబులకు(ముస్లింలు)..దళిత వీరులకు, సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం”..

మేము YCP TDP JSP బీజేపీ ఇలా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు..
ఈ పోరాటం కేవలం మా ఉనికికోసం,ఆత్మగౌరవం కోసం మాత్రమే..

క్రైస్తవులు,దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారు..
రాష్ట్రంలో 50సీట్లలో ముస్లిం సోదరులు పోటీపడతారు..
ఇదొక చరిత్ర అయ్యే ఛాన్స్ వుంది..

1.మేము కూటమి రెబల్స్ గా పోటీకి దిగుతున్నాం కాబట్టి కూటమి ఓటు చీలి YCP కి మేలు జరగొచ్చు..
2.మేము క్రైస్తవ, దళిత, ముస్లిం, సెక్యూలర్ హిందువుల తరపున పోటీకి దిగుతున్నాం కనుక YCP ఓటు చీలి కూటమికి మేలు జరగొచ్చు..
3.లేదా మాకు ఓట్లు పడక మేము అవమానం పాలు కావొచ్చు..అని రాసుకొచ్చాడు.

ఒకవేళ రాజేష్ నిజంగానే ఇండిపెండెంట్ గా 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్లు అనేవి చీలుతాయి. ఇది కూటమికి దెబ్బ తప్ప మరోటి లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజేష్ వల్ల..తన వర్గ ఓట్లతో పాటు మిగతా కులాల ఓట్లు కూటమి కి పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది..ఇప్పుడు అదే రాజేష్ తన వర్గాన్నే ఎన్నికల్లో నిలబెడితే ఆ ఓట్లు వారికే పడొచ్చు..లేదంటే వైసీపీ కి పడొచ్చు.

ఇక్కడ వైసీపీ కి ఎందుకు పడొచ్చు అని చెపుతున్నామంటే..టీడీపీ ముందుగా రాజేష్ కు టికెట్ ఇచ్చిందని..ఆ తర్వాత పలు వివాదాలు తెరపైకి రావడం తో రాజేష్ కు కాకుండా జనసేన అభ్యర్ధికి ఇవ్వడంతో కాస్త రాజేష్ వర్గీయులు ఆగ్రహంతోనే ఉన్నారు. రాజేష్ వల్లే టికెట్ చేజారినప్పటికీ, ఒక్క ఛాన్స్ రాజేష్ కు ఇస్తే బాగుండేది అని ఆయన వర్గీయులు అంటున్నమాట. సో వారు కూటమికి ఓటు వేస్తారనేది సందేహమే..వేస్తే వల్ల వర్గీయులకే వెయ్యాలి..లేదంటే వైసీపీ కి వెయ్యాలి. సో వారు ఎటు వేస్తారో చెప్పాలేమో. ఏది ఏమైనప్పటికి రాజేష్ సొంతగా పార్టీ పెట్టిన…తన వర్గీయులను ఇండిపెండెంట్స్ గా నిలబెట్టిన కూటమికే నష్టం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు టీడీపీ నేతలు రాజేష్ తో టచ్ లోకి వెళ్లారని..ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తుంది. మరి రాజేష్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Also : CSK vs SRH: 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై

  Last Updated: 05 Apr 2024, 08:59 PM IST