Site icon HashtagU Telugu

Maharashtra Elections 2024: పవన్ కళ్యాణ్ కు బీజేపీ కీలక బాధ్యతలు.. రోడ్ మ్యాప్ ఇదే!

Pawan Kalyan Route Map In Maharashtra

Pawan Kalyan Route Map In Maharashtra

Maharashtra Elections 2024: ఎన్‌డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు అప్పజెప్పేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్:

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో, బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రచారంలోకి ఆహ్వానించింది. ఎన్‌డీఏ కూటమి తరపున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్‌ను కోరింది బీజేపీ.

బీజేపీ అభ్యర్థన మేరకు, పవన్ కళ్యాణ్ నవంబర్ 16 మరియు 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రకటన జనసేన పార్టీ విడుదల చేసింది, ఇందులో పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ప్రధానంగా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు. బీజేపీ జాతీయ నాయకులు మరియు మహారాష్ట్ర రాష్ట్ర నాయకులతో చర్చల అనంతరం ఈ ప్రచార షెడ్యూల్ ఖరారైందని జనసేన పార్టీ తెలిపింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, పవన్ కళ్యాణ్ ఐదు బహిరంగ సభల్లో మరియు రెండు రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఆయన మొదటి రోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

16వ తేదీ (నవంబర్ 16):

17వ తేదీ (నవంబర్ 17):

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 20న జరుగనుండగా, ఫలితాలు నవంబర్ 23న విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంలో ఎన్డీయే కూటమి తరుపున పవన్ కళ్యాణ్ రెండు రోజుల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారయింది.