కడపలో మహానాడు (Mahanadu 2025 ) వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. మంగళవారం మొదలైన ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, పార్టీ శ్రేణులు , అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. వారందరికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలను (Mahanadu Food Menu) రుచి చూపించేలా ఏర్పాట్లు చేశారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం వడ్డించబోతుండటం విశేషం.
మొదటి రెండు రోజుల పాటు రోజూ దాదాపు రెండు లక్షల మందికి అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేలా ఏర్పాట్లు చేసారు. గురువారం జరిగే బహిరంగ సభకు భారీగా జనాలు తరలిరావడంతో, ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందించేందుకు తోడు, బయట ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. అందులో మూడు లక్షల మందికి భోజనం అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1,700 మంది వంటవారు, 800 మంది వడ్డించేందుకు నియమించారు.
Former Wyra MLA : వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూత
ఆహార మెనూ విషయంలో ప్రత్యేకత ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టీ, కాఫీ ఉంటే, మధ్యాహ్నం గోంగూర చికెన్, ఆంధ్రా చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి లాంటి వంటకాలు వడ్డించనున్నారు. శాఖాహారంలో పూల్ మఖానా, టమాటా పప్పు, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ వంటివి ఉండనున్నాయి. సాయంత్రం స్నాక్స్‌లో కార్న్ సమోసా, మిర్చి బజ్జీ, పకోడీ వంటివి ఉంటాయి. రాత్రి వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు వంటివి ఉండనున్నాయి. ఈ విస్తృతమైన భోజన ఏర్పాట్లు మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.