Site icon HashtagU Telugu

Mahanadu : కడుపునిండా భోజనాలు పెట్టడం టీడీపీకి అలవాటే..తెలుగు తమ్ముళ్లు సంతోషం

Mahanadu Menu

Mahanadu Menu

తెలుగుదేశం పార్టీ (TDP) పసుపు పండుగగా నిర్వహించే మహానాడు (Mahanadu) ఈసారి కడప గడ్డపై ఘనంగా జరుగుతోంది. పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, కార్యకర్తల సంక్షేమం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. తొలిసారిగా కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్నారు. వారికి భోజన వసతులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం తెలుగు తమ్ముళ్లకు గర్వకారణంగా మారింది.

Liver Cancer: బిగ్ బాస్ 12 విజేతకు లివర్ క్యాన్సర్.. ఇది సోకితే బ‌తికే అవ‌కాశాలు ఉంటాయా!

మహానాడు మూడు రోజుల పాటు సాగుతున్న తరుణంలో ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి – మూడు పూటలూ విందు భోజనాలను (Mahanadu Food) ఎంతో ప్రణాళికతో అందిస్తున్నారు. మొదటి రోజు 2 లక్షల మందికి, చివరి రోజు 5 లక్షల మందికి అంచనా వేశారు. మొత్తం 10 లక్షల మందికి విందు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ అధిష్ఠానం కార్యకర్తలను కేవలం పార్టీ సభ్యులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయడం హర్షణీయం. ఈ ఏర్పాట్లను చూసి పార్టీ శ్రేణులు గర్వంతో, కృతజ్ఞతతో స్పందిస్తున్నారు.

Suzuki e-Access: మార్కెట్‌లోకి కొత్త స్కూటీ.. ధ‌ర‌, ఫీచ‌ర్లు చూస్తే మ‌తిపోవాల్సిందే!

వంటకాల విషయానికి వస్తే.. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రుచుల సమ్మేళనంగా ప్రత్యేక మెనూ రూపొందించారు. మాంసాహార, శాఖాహార వంటకాలతో పాటు పలురకాల స్వీట్లు, స్నాక్స్‌తో ఆకలికి అద్భుత పరిష్కారం అందించారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పొంగలి, టమాటా బాత్, టూటీ ఫ్రూటీ కేసరి వంటి ఐటమ్స్, మధ్యాహ్న భోజనంలో గోంగూర చికెన్‌, ఎగ్ రోస్ట్‌, బిర్యానీ, పచ్చళ్ళు, శాకాహారం తినేవారికి ప్రత్యేక వంటకాలు, రాత్రి అల్పాహారంలో వెజ్‌, నాన్ వెజ్ ఐటమ్స్‌తో పాటు రుచికరమైన ఫ్రూట్ హల్వా, తాపేశ్వరం కాజా, మైసూర్ పాక్ వంటి స్వీట్లు కూడా వడ్డిస్తున్నారు. మొత్తం 1,700 మంది వంటవారు, 800 మంది వడ్డించే సిబ్బంది ఈ భారీ ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

Exit mobile version