Mahanadu 2023 : మ‌హానాడుకు ముస్తాబ‌వుతోన్న రాజ‌మండ్రి! లోకేష్ కు ప‌దోన్న‌తి?

మ‌హానాడుకు(Mahanadu 2023) రాజ‌మండ్రి సిద్ద‌మ‌వుతోంది. ప‌సుపు మ‌యం అవుతోంది. గ‌తంలో జ‌రిగిన మ‌హానాడుల‌కు ఇప్పుడు జ‌రుగుతోన్న పండుగ భిన్నం.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 05:12 PM IST

మ‌హానాడుకు(Mahanadu 2023) రాజ‌మండ్రి సిద్ద‌మ‌వుతోంది. ప‌సుపు మ‌యం అవుతోంది. గ‌తంలో జ‌రిగిన మ‌హానాడుల‌కు ఇప్పుడు జ‌రుగుతోన్న పండుగ భిన్నం. ఎందుకంటే, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక. అంటే 100ఏళ్ల తెలుగోడి పండుగ‌. ఏడాది మొత్తం శ‌తిజ‌యంతి వేడుక‌ల‌ను జ‌రిపిన టీడీపీ మ‌హానాడును అంత‌కంటే మిన్న‌గా జ‌రుపుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో తెలుగు పండుగ శోభాయ‌మానంగా జ‌ర‌గ‌బోతుంది. అందుకోసం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్(Lokesh) తాత్కాలిక బ్రేక్ ఇస్తూ రాజమండ్రి వైపు మ‌ళ్లారు.

యువ‌గ‌ళంకు ఈనెల 30 వ‌ర‌కు బ్రేక్ (Mahanadu 2023)

ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు వ‌ద్ద పాద‌యాత్ర జ‌రుగుతోంది. అక్క‌డ తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. క‌డ‌ప ఎయిర్ పోర్ట్ నుంచి గురువారం సాయంత్రం విజ‌య‌వాడ‌కు చేరుకుంటారు. శుక్ర‌వారం రాజ‌మండ్రికి చేరుకుంటారు. మ‌హానాడుకు హాజ‌రు కానున్నారు. ఈనెల 30వ తేదీ వ‌ర‌కు ఆయ‌న చంద్ర‌బాబుతో ఉంటారు. తిరిగి ఈనెల 30వ తేదీన జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తారు. ఇప్ప‌టికే డిజిట‌ల్ ఇన్విటేష‌న్ల‌ను చంద్ర‌బాబు అంద‌రికీ పంపుతున్నారు. సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌తో క‌ళ‌క‌ళ‌లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ వ‌ర్గాల‌కు చెందిన దిగ్గ‌జాలు మ‌హానాడు వేదిక‌ను పంచుకోబోతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ విభాగాల ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. అంగ‌రంగ వైభ‌వంగా మ‌హానాడును నిర్వహించ‌డానికి స‌న్నాహాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి.

మ‌హానాడుకు చంద్ర‌బాబు డిజిట‌ల్ ఇన్విటేష‌న్లు

గ‌త రెండేళ్లుగా మ‌హానాడు వ‌ర్చువ‌ల్ గా జ‌రిగింది. ఏడాది కాలంగా మినీ మ‌హానాడుల‌ను ప‌లుచోట్ల నిర్వ‌హించారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో ఇటీవ‌ల ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హానాడు వేదిక‌గా(Mahanadu 2023)  రాబోవు ఎన్నిక‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. ప‌లు రంగాల మీద తీర్మానాలు చేయ‌బోతున్నారు. ఒక ర‌కంగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను త‌లపించేలా మ‌హానాడు స్పీచ్ లు ఉండ‌బోతున్నాయి. సంస్థాగ‌తంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని భావిస్తున్నారు. రాబోవు రోజుల్లో లోకేష్ ను మ‌రింత కీల‌కం చేసేలా నిర్ణ‌యాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పాద‌యాత్ర ద్వారా ఆయ‌న క్రేజ్ పెంచుకున్నార‌ని టీడీపీ భావిస్తోంది. ఆయ‌న క‌ష్టానికి తగిన విధంగా ప‌దోన్న‌తి ఉంటుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు ప‌దోన్న‌తి? (Mahanadu 2023)

సంస్థాగ‌త అంశాల‌పై చ‌ర్చించే ఎజెండా మ‌హానాడులో(Mahanadu 2023) ఉంది. ఆ సంద‌ర్భంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ప్ర‌తిపాదించాల‌ని కీల‌క నేత‌లు కోరుతున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఆయ‌న కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి పొందారు. గ‌త ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇప్పుడు సంస్థాగ‌త ప‌దోన్న‌తి కోసం క‌స‌రత్తు జ‌రుగుతోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని అప్ప‌గించాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఆ ప్ర‌తిపాద‌న చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. రాబోవు రోజుల్లో కాబోయే సీఎం అంటూ లోకేష్ (Lokesh)ను ప‌లు సంద‌ర్భాల్లో మాజీ మంత్రులు ప్ర‌మోట్ చేశారు. ఇప్పుడు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో సంస్థాగ‌తంగా లోకేష్ కు ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం ద్వారా భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా మార్చబోతున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోని చర్చ‌.

 Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

తెలంగాణ టీడీపీ నేత‌లు కూడా మ‌హానాడుకు పెద్ద సంఖ్య‌లో హాజ‌రు కాబోతున్నారు. ఇరు రాష్ట్రాల్లోని కీల‌క లీడ‌ర్లు, ప్ర‌తినిధుల‌తో ఈనెల 27వ తేదీన స‌మావేశం జ‌ర‌గ‌బోతుంది. ప్ర‌తినిధుల స‌భ‌కు క‌నీసం 15వేల మంది వ‌ర‌కు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈనెల 28 స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా  7 ల‌క్ష‌ల మంది మందికి త‌గ్గ‌కుండా జ‌నం వ‌స్తార‌ని టీడీపీ లెక్కిస్తోంది. ఆ వేదిక మీద నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల శంఖారావాన్ని చంద్ర‌బాబు పూరిస్తార‌ని తెలుస్తోంది. ప్రస్తుత ప్ర‌భుత్వం చేస్తోన్న అరాచ‌కాల‌కు వ్య‌తిరేకంగా తీర్మానాలు చేయ‌డం ద్వారా పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునివ్వ‌బోతున్నారు. పొత్తుల మీద కూడా సూచాయ‌గా ఒక క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంది.

పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోవ‌త్స‌వానికి చంద్ర‌బాబు దూరం?

ఈనెల 27, 28న మ‌హానాడు బిజీ షెడ్యూల్ లో ఉన్న చంద్ర‌బాబు పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి వెళ్ల‌ర‌ని తెలుస్తోంది. ఆయ‌న త‌ర‌పున ప్ర‌తినిధుల‌ను పంపిస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి తుది నిర్ణ‌యం తీసుకోలేదు. ఇప్ప‌టికే 20 పార్టీలు బాయ్ కాట్ చేసిన జాబితాలో లేకుండా మ‌ధ్యేమార్గంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంద‌రూ హాజ‌రు కావాలని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి
ఇచ్చిన పిలుపును చంద్ర‌బాబు(Chandrababu) తిరస్క‌రించే అవ‌కాశం ఉంది. కానీ, ప్ర‌ధాని మోడీ ఆహ్వానం మేర‌కు చంద్ర‌బాబు హాజ‌రు కాక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌తినిధుల‌ను మాత్రం పంపుతార‌ని తెలుస్తోంది. మొత్తం మీద మ‌హానాడు (Mahanadu 2023) బిజీలో ఉన్న చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్నారు. మ‌హానాడు వేదిక‌గా తెలుగుదేశం పార్టీ భవిష్య‌త్ రాజ‌కీయ ప్ర‌ణాళిక మీద ఒక స్ప‌ష్టత రానుంది.

Also Read : TDP Fight : జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ `గెరిల్లా` ఫైట్‌