Site icon HashtagU Telugu

Mahanadu 2023 : AP రావ‌ణాసురుడు జ‌గ‌న్ : మ‌హానాడులో చంద్ర‌బాబు

Mahanadu 2023

Mahanadu 2023

Mahanadu 2023 : ఏపీ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన రాక్ష‌సుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటూ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు మండిప‌డ్డారు. రాష్ట్రానికి రావ‌ణాసురుడి మాదిరిగా ఉన్నార‌ని విమ‌ర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా ప‌రిపాల‌న మారిందని అన్నారు. ప్ర‌జ‌ల్ని మోసం చేసి రాజ్యాన్ని ఏలుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినాశ‌కార‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌హానాడు ప్రారంభమైన తొలి రోజు బీసీల‌కు జ‌రుగుతోన్న అన్యాయంపై పోరాటం చేసే తీర్మానం చేశారు. ఆ త‌రువాత ఎస్సీల‌కు జ‌రిగిన దారుణాల‌ను నిర‌సిస్తూ తీర్మానం పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల తొలి విడ‌త మేనిఫెస్టోను ప్ర‌క‌టించ‌డానికి సిద్ద‌మైయింద‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ఆదివారం తొలి విడ‌త మేనిఫెస్టో ను విడుద‌ల చేస్తామ‌ని అన్నారు. ఎన్నిక‌ల‌కు ఎప్పుడు వ‌చ్చిన‌ప్ప‌టికీ సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. పులివెందులతో స‌హా రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.

ఏపీ రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన రాక్ష‌సుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Mahanadu 2023)

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, ఇతర ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించడంలో ఆయన అసమర్థతను సూచిస్తుంది. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ, “రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉంది?” అని నాయుడు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజల మద్దతు కావాలని పిలుపునిచ్చారు. అదనంగా, రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి మరియు అభివృద్ధి పరంగా మొదటి రెండు స్థానాలకు ఎదగాలని నాయుడు ఆకాంక్షించారు.

ఎన్నికలు 2024లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా సైకిల్ రెడీ

మూడు ప్రత్యేక రాజధానులను ప్రతిపాదిస్తామనే నెపంతో ప్రస్తుత పరిపాలన అమరావతి రాష్ట్ర రాజధాని హోదాను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో(Mahanadu 2023 ) ప్రసంగించిన‌ ఆయన ఎన్నికలు 2024లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా సైకిల్ రెడీగా ఉందని అన్నారు. గత నాలుగేళ్లగా వైసీపీ ప్రభుత్వం ఎంతో వేధిస్తున్నా టీడీపీ కార్యకర్తలు భయపడలేదని, వెనుకంజ వేయలేదని ప్రశంసించారు.

Also Read : TDP Mahanadu 2023: సైకో జగన్ ఏపీని నాశనం చేశాడు : చంద్రబాబు

దిశ చట్టమే లేకపోయినా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారని సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. అమ్మఒడి అనేది నాటకమని, నాన్నబుడ్డి వాస్తవమని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో మహానాడులు అవసరమవుతాయని అన్నారు. ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, అప్పుల్లో తొలి స్థానంలో, విదీశీ పెట్టుబడుల్లో 14వ స్థానంలో ఏపీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ సహాయ నిరాకరణ చేశాయని అన్నారు. తిరుమలలో కూడా గంజాయి వ్యాపారం జరగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పీ4 విధానంతో పేద వాడిని ధనికుడిని చేసేందుకు

ఎక్కడో ఉండే అమూల్ ను ఇక్కడకు తెచ్చాడు మన అమూల్ బేబి జగన్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. స్కాంలు చేయడంలో జగన్ ది మాస్టర్ మైండ్ అని అన్నారు. ప్రజలను సర్వనాశనం చేయడానికే జగన్ వచ్చాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రూ. 2 వేల నోట్లు ఎక్కడా కనిపించడం లేదని, నోట్లు అన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4 విధానంతో పేద వాడిని ధనికుడిని చేసేందుకు నాంది పలుకుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తొలి రోజు మ‌హానాడుకు 15వేల మంది వ‌స్తార‌ని అంచ‌నా వేయ‌గా ల‌క్ష మంది హాజ‌ర‌య్యారు. రెండో రోజు 7ల‌క్ష‌ల‌కు పైగా జ‌నం హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు అన్నారు.

Also Read : Mahanadu 2023: వైభ‌వంగా మ‌హానాడు, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడుగా చంద్ర‌బాబు ఏకగ్రీవం