Mahanadu 2023 : రండి! క‌ద‌లిరండి రాజ‌మండ్రికి! మ‌హానాడు పిలుస్తోంది!!

తెలుగు పండుగ (Mahanadu 2023) టైమ్ వ‌చ్చేసింది. రాజ‌మండ్రి ప‌సుపు తోర‌ణాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. తెలుగువాడి చూపంతా మ‌హానాడు మీదే ఉంది.

  • Written By:
  • Updated On - May 26, 2023 / 05:16 PM IST

తెలుగు పండుగ (Mahanadu 2023) టైమ్ వ‌చ్చేసింది. రాజ‌మండ్రి ప‌సుపు తోర‌ణాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. తెలుగువాడి చూపంతా మ‌హానాడు మీదే ఉంది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 7ల‌క్ష‌ల మంది ఈ పండుగకు హాజ‌రు కానున్నారు. ప్ర‌తి నియోజక‌వ‌ర్గం నుంచి క‌నీసం 15వేల‌కు త‌గ్గ‌కుండా ప‌సుపు సైన్యం క‌దులుతోంది. ఆ మేర‌కు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు(Chandrababu) దిశానిర్దేశం చేశారు. గ‌త వారం రోజులుగా ఆయ‌న టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా మ‌హానాడు ఏర్పాట్ల‌ను స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టికే గ్రౌండ్లో సీనియర్ల‌తో కూడిన ప‌లు క‌మిటీలు ప‌నిచేస్తున్నాయి. అతిథుల‌కు ఏ మాత్రం అసౌక‌ర్యం లేకుండా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింది. యంత్రాంగం, వైసీపీ శ్రేణులు పెడుతోన్న ఇబ్బందుల‌ను త‌ట్టుకుని తెలుగు పండుగ సంద‌డి క‌నిపిస్తోంది.

ఈ నెల 27న‌ ప్ర‌తినిధుల స‌భ‌ (Mahanadu 2023)

తొలి రోజు (శ‌నివారం) ప్ర‌తినిధుల స‌భ‌తో మ‌హానాడు(Mahanadu 2023) ప్రారంభం కానుంది. క‌నీసం 15వేల మందికి త‌గ్గ‌కుండా హాజ‌ర‌య్యే ఈ స‌భ వ‌చ్చే ఎన్నిక‌లకు శంఖారావం పూరించ‌నుంది. బూత్ లెవ‌ల్ నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ఎలా సిద్ధం కావాలి? అనే అంశంపై దిశానిర్దేశం చంద్ర‌బాబు ఇవ్వ‌నున్నారు. తొలి రోజు పసుపు సైన్యాధిప‌తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. అన్న ఎన్టీఆర్ 100వ జ‌యంతి సంద‌ర్భంగా ఈనెల 28వ తేదీన మ‌హానాడుకు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి ప‌సుపు సైనికులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి రావ‌డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్ర‌త్యేక బ‌స్సులు, రైళ్లు, ప్రైవేటు వాహ‌నాల ద్వారా మ‌హానాడుకు హాజ‌రు కానున్నారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఉత్తేజ‌ప‌రిచే పాట‌ల‌ను ట్యూన్ చేసింది. ఆలోచింప‌చేసే లిరిక్స్ తో క‌దంతొక్క‌డానికి రిహార్స‌ల్స్ అన్నీ పూర్త‌య్యాయి. పండుగ సంబురం ఆకాశాన్ని తాక‌నుంది. గోదావ‌రి తీరం పసుపుతో పుల‌కించిపోనుంది.

అన్న ఎన్టీఆర్ 100వ జ‌యంతి వేడుక‌

తెలుగుదేశం పార్టీ ఈనెల 27,28 తేదీలలో జరుప తలపెట్టిన మహానాడులో(Mahanadu 2023) ఎన్నికల శంఖారావం పూరించనున్నది. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనే దిశగా పార్టీ శ్రేణులను అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమాయత్తం చేశారు. గత సంవత్సరం కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న‌ తెలుగువారంతా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. విదేశాలలో సైతం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా టిడిపికి నూతన జవసత్వాలు సమకూర్చే విధంగా చంద్రబాబు శ్రేణులకు మార్గదర్శనం చేయ‌బోతున్నారు.

ఈ త‌రానికి టీడీపీ భావ‌జాలం

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన యువతకు తెలుగుదేశం పార్టీ స్థాపన లక్ష్యాలు, ఆశయాలు తెలిసే అవకాశం త‌క్కువ‌. అందుకే, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా ఈ తరానికి టిడిపి భావజాలం పై అవగాహన క‌లిగించారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ గుర్తింపును తీసుకువస్తే, దానిని విశ్వవ్యాప్తం చంద్రబాబు నాయుడు(Chandrababu) చేయ‌గ‌లిగారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు తీర్చిదిద్దిన తీరు దేశంలోనే ఒక నమూనాగా నిలిచింది. కాలంతో పోటీపడుతూ చంద్రబాబు 20ఏళ్ల క్రితం రూపొందించిన విజ‌న్ 2020 ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారి అభ్యున్నతికి ఉప‌యోగ‌ప‌డింది.

విజ‌న్ 2020 ఫ‌లాలు

చంద్రబాబు విజ‌న్ నుంచి పుట్టిన‌ సైబరాబాద్ ప్ర‌స్తుతం మహానగరం గా మారి లక్షలాది మందికి ఉపాధి ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. గతంలో రాళ్ళ గుట్టలు, పిచ్చిమొక్కలు తో నిర్మానుష్యంగా వున్న సైబరాబాద్ ప్రాంతం నేడు దేశ, విదేశీ సంస్థలతో లక్షలాది మంది ఉపాధి పొందుతూ ప్రభుత్వానికి సైతం పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్నది. చంద్రబాబు సంపద సృష్టికర్తగా గుర్తింపు పొందారు. అదే క్రమంలో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని(Amaravathi) తీర్చిదిద్దాలని తపన పడ్డారు.

అమ‌రావ‌తి డ్రీమ్

చంద్రబాబుపై అపార నమ్మకం తో 29 వేలమందికి పైగా రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములను స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ భూములు ఇచ్చిన రైతుల్లో ఎకరం లోపు వున్న వారు 20,490 మంది, 2 ఎకరాల లోపు రైతులు 5,227మంది, 5 ఎకరాల కంటే తక్కువ వున్నవారు 3,387 మంది వున్నారు. 5 ఎకరాలకు మించి వున్న రైతులు కేవలం 827 మంది మాత్రమే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులలో అత్యధికులు బిసి, ఎస్సీ వర్గాలకు చెందినవారే వున్నారు. అమరావతి నిర్మాణం జ‌రిగి ఉంటే ప్రపంచంలో నే తొలి దళిత బహుజన రాజధానిగా చరిత్రలో నిలిచిపోయేది. మహానాడులో (Mahanadu 2023)అందుకు సంబంధించి ఒక దృఢ సంకల్పం తీసుకునే విధంగా చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

 Also Read : TDP Fight : జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ `గెరిల్లా` ఫైట్‌

యువగళం పాదయాత్రతో లోకేష్ టిడిపి శ్రేణులకే కాకుండా సాధారణ ప్రజానీకానికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. కుల, మత, వయో భేదాలతో నిమిత్తం లేకుండా అన్నివర్గాల ప్రజలు లోకేష్ ను తమ ఇంటి బిడ్డగా భావిస్తూ ఎనలేని ఆప్యాయత కనబరుస్తున్నార‌ని ఆ పార్టీ భావిస్తోంది. టిడిపి కి లోకేష్ ఇప్పుడు తరగని ఆస్తిగా మారారు. తాత ఎన్టీఆర్ ఆశయాలు, పట్టుదల, తండ్రి చంద్రబాబు లోని చాణక్యం, దార్శనికత వెర‌సి లోకేష్ రూపం అంటూ టీడీపీ మురిసిపోతోంది.

ఎన్నికల శంఖారావం (Mahanadu 2023)

`ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..` అంటూ చంద్రబాబు నిర్విరామంగా పర్యటనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతిని ఎండగ‌ట్ట‌డం ప్రజల్లో పోరాట స్ఫూర్తిని ర‌గిలిస్తోంది. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు లోకేష్ ల దన్నుతో ప‌సుపు సైన్యం ఉత్సాహంతో కదం తొక్కుతోంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ 27, 28 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహించ తలపెట్టిన మహానాడు(Mahanadu 2023) చరిత్రలో నిలిచిపోయేలా చేయాల‌ని క‌సిగా ఎల్లో సైన్యం ప‌నిచేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు చూస్తోన్న పండుగ గ‌డియ‌లు రావ‌డంతో అంద‌రి చూపు రాజ‌మండ్రి మీద ఉందన‌డంలో సందేహం లేదు.

Also Read : Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌