లిక్కర్ డాన్ గా పేరుగాంచిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. నెల్లూరుకు చెందిన ఆయన ఇళ్లలో ఈడీ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. గత రెండు వారాలుగా టీడీపీ చేసిన ఆరోపణలకు అనుగుణంగా వైసీపీ నేతల ఢిల్లీ లిక్కర్ స్కామ్ `క్లూ` బయటపడుతోంది.
దేశ వ్యాప్తంగా సుమారు 40 చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. హైదరాబాదులో 20 చోట్ల సోదాలు జరుగుతుండగా ఏపీలోని నెల్లూరు కీలకంగా దాడులు నిర్వహిస్తోంది. వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని నివాసంతో పాటు, ఢిల్లీ నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
ఢిల్లీలోని వైన్ షాపుల్లో కొన్నింటిని మాగుంటకు చెందిన లిక్కర్ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ ఆధారాలను సేకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. మరోవైపు మాగుంటతో పాటు మరికొందరు వైసీపీ నేతల హస్తం ఈ స్కాంలో ఉందని ఈడీ అనుమానిస్తోంది.