YCP : వైసీపీకి మరో ఎదురుదెబ్బ..మాగుంట శ్రీనివాసులు రాజీనామా

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 10:19 AM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని బయటకు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) పార్టీకి రాజీనామా చేసారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని.. అనివార్య పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వస్తోందన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీలో ఉంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానన్నారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే.. ఒక బ్రాండ్‌ ఉందన్నారు. తమ కుటుంబానికి అహం లేదని.. ఉన్నది ఆత్మాభిమానం మాత్రమే అని చెప్పుకొచ్చారు. మాగుంట రాజీనామాతో ఈ కొద్దిరోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడినట్లయింది. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్‌కుమార్‌ (కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), రఘురామకృష్ణరాజు (నర్సాపురం)తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీని వీడారు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ లో చేరుతారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also : CUET PG 2024: కామ‌న్ యూనివ‌ర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పూర్తి షెడ్యూల్ విడుద‌ల‌..!