Site icon HashtagU Telugu

Ongole: మాగుంట రాఘవరెడ్డి టీడీపీలో చేరనేలేదు అప్పుడే ఎన్నికల ప్రచారం

Ongole

Ongole

Ongole: మాగుంట రాఘవరెడ్డితో పాటు ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ పార్టీలో చేరకముందే ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట రాఘవరెడ్డి అభ్యర్థిత్వంపై ప్రచారం ఊపందుకుంది. దీంతో నియోజకవర్గ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్సార్‌సీపీకి, లోక్‌సభకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతున్నానని, ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. మాగుంట కుటుంబ భవిష్యత్తు కార్యాచరణ తర్వాత ప్రకటిస్తామని, అయితే ఒంగోలు ఎంపీ బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

కొద్దీ రోజులుగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లకు మాగుంట రాఘవ రెడ్డి ఒంగోలు ఎంపీ స్థానానికి అభ్యర్థిత్వంపై ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. టీడీపీ తరుపున ఆప్షన్ 1 మాగుంట రాఘవ రెడ్డి, ఆప్షన్ 2 నోటాపై ప్రజాభిప్రాయాన్ని అభ్యర్థిస్తూ మహిళా ఆపరేటర్ వాయిస్‌తో కాల్స్ రావడంతో ప్రజలు విస్తుపోతున్నారు. మాగుంట కుటుంబం ఇంకా టీడీపీ లోకి వెళ్లనేలేదు, అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలవ్వడంతో ఆశ్చర్యపోతున్నారు.

కాగా టీడీపీలో చేరి మార్చి 5న ఒంగోలులో నారా లోకేష్ నిర్వహించే ‘శంఖారావం’ బహిరంగ సభలో పాల్గొనేందుకు మాగుంట కుటుంబం సిద్ధమైంది. అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావిస్తున్నారు.

Also Read: Nayanatara : భర్త విఘ్నేష్ ని అన్ ఫాలో చేసిన నయన్.. ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ లో కంగారు..!