JC Vs Madhavi Latha : వయసైపోయిన మనిషి అంటూ జేసీ పై మాధవీలత ఫైర్

JC Vs Madhavi Latha : "ఆ వయసైపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నవారికి సంతాపం"

Published By: HashtagU Telugu Desk
Madahvi Jc

Madahvi Jc

జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ నటి మాధవీలత (JC Vs Madhavi Latha) మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెల్సిందే. జేసీ మాట్లాడిన అసభ్య భాషపై మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ వయసైపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నవారికి సంతాపం” అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు జేసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Pushpa 2 Stampede Case : పుష్ప కు బెయిల్..ఫ్యాన్స్ సంబరాలు

మహిళల పరువు, ప్రాణాలను కాపాడేందుకు తాను ఎటువంటి ఒత్తిడి ఎదురైనా వెనక్కి తగ్గనని మాధవీలత స్పష్టం చేశారు. “నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. కానీ మహిళల హక్కుల కోసం పోరాడటంలో నేను ఒంటరిగానైనా ముందుకు వెళ్తా” అంటూ తన ధైర్యాన్ని చాటిచెప్పారు. జేసీ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు చెందిన వారిపై అపవాదులు రేపుతున్నాయని మాధవీలత అన్నారు. మహిళల గురించి చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఎంతగా అనైతికమో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మాధవీలత అన్నారు. జేసీ వంటి నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడి, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె అభ్యర్థించారు. రాజకీయాల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు.

Viral : స్టేషన్ కు వచ్చిన మహిళపై పోలీసు అసభ్యకర ప్రవర్తన

ఈ వివాదానికి కారణంగా కొత్త సంవత్సర వేడుకలు నిలిచాయి. న్యూ ఇయర్ సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఈవెంట్‌పై మాధవీలత తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ “జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లకూడదని, అక్కడ దారుణ ఘటనలు జరుగుతున్నాయి” అంటూ ఒక వీడియో విడుదల చేశారు. మాధవీలత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేసీ, ఆమెను మహిళలను అవమానించేలా మాట్లాడారంటూ విమర్శించారు. తాడిపత్రిలోని మహిళల కోసం నిర్వహించిన ఈవెంట్‌ మీద అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

  Last Updated: 03 Jan 2025, 07:39 PM IST