Madanapalle : మదనపల్లి సబ్ కలెక్టరేట్‌ ఆఫీస్ అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు

ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి..? కంప్యూటర్ రూమ్ క్లర్క్ గా పని చేసే గౌతమ్ తేజ ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనేదానిపై అరా తీస్తున్నారు

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 07:50 PM IST

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు (Madanapalle Sub Collector Office)లో అగ్ని ప్రమాదం (Fire Incident) కలకలం రేపుతోంది. నిజంగా ఇది ఇది ప్రమాదమా..? లేక కావాలని చేసిన కుట్రపూరితమా..? విచారణ చేయాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ గా నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన జరగడం తోఅనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన DGP లోతుగా విచారణ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అగ్నిప్రమాదంలో అసైన్డ్, 22 ఏ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు తెలుస్తోంది. ఇక గౌతమ్ తేజ అలియాస్ గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నట్లు చెపుతున్నారు. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి..? కంప్యూటర్ రూమ్ క్లర్క్ గా పని చేసే గౌతమ్ తేజ ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి ఎందుకు వెళ్లాడు? ఏ పని కోసం వెళ్లాడు? అనేదానిపై అరా తీస్తున్నారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపై అనుమానం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టమని తేల్చిచెప్పారు. పెద్దిరెడ్డి అవినీతి వెలుగులోకి వచ్చాకే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆర్డీవో, తహశీల్దార్, ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ ఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది ప్రాథమిక నివేదిక ఇవ్వాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు కోరారు. దీంతో పాటుగా సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ద్వారా కీలక విషయాలు CID చీఫ్ రవిశంకర్ అయ్యర్ తెలుసుకున్నారు. అలాగే రంగంలోకి దిగిన క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాల సేకరించి..షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ఈ ప్రమాదం జరగలేదని.. అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అలాగే కావాలనే ఫైళ్లను తగల బెట్టారనే కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు.

Read Also : Dangerous Selfies: భారీ వర్షాలు కురుస్తున్నాయి, జర సెల్ఫీలు మానుకోండి

Follow us