Madakasira Tehsildar : మాకు లంచాలు ఇస్తేనే పనిచేస్తాం – శ్రీసత్యసాయి జిల్లా మడకశిర తహశీల్దార్

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 07:01 PM IST

రాముడి కాలంలోనే లంచం ఉండేది.. మినిస్టర్ వస్తే నాకు రూ.1.75 లక్షలు నాకు ఖర్చయ్యింది. ఈ డబ్బులు నా జేబుల్లో నుంచి తీసి ఇవ్వాలా..? పై నుంచి ఎవరైనా వస్తే హిందూపూర్ నుంచి తెప్పించాలి. మెనూ చూడు.. మడకశిర తహసీల్దార్ ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం లంచం అనేది కామన్ అయ్యింది. ప్రతి చోట పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే. అటెండర్ దగ్గరి నుండి ఫై స్థాయి ఉద్యోగి వరకు..అంతే ఎందుకు రాజకీయ నేతలకు సైతం లంచం ఇవ్వందే పని జరగని రోజులు..అందుకే చాలామంది లంచం ఇచ్చి పని చేయించుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్నీ మడకశిర తహశీల్దార్ చెప్పుకొచ్చారు. అవినీతి అనేది లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పదేపదే చెబుతూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం అవినీతి మాత్రం జరుగుతూనే ఉంది. అవినీతికి పాల్పడుతున్న అధికారులు కొందరు తమ అవినీతిని సమర్ధించుకోవడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసిల్దార్ .. మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు తన సొంత పొలం సమస్యను తహశీల్దార్ ముందుకు తీసుకువస్తే మీ క్రింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయరా అని తన ఆవేదన వెల్లబోసుకున్నాడు. రైతుతో తహశీల్దార్ వెటకారంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి లాంటి వారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు మేమెంత అని అన్నారు. మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 13వ తేదీ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం లక్ష 70 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని అన్నారు. ఏదన్నా అంటే అధికారులు డబ్బులు తింటున్నారు అంటారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము…ఎవరికీ మా బాధ అర్ధం కాదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాముడి కాలంలోనే లంచం ఉందనీ, అవినీతికి ఎవరూ అతీతులు కాదన్నట్లుగా సదరు తహశీల్దార్ వ్యాఖ్యానించారు. దీనికి సంబదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read : వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది