Site icon HashtagU Telugu

Lulu Group : మళ్లీ ఏపీకి తిరిగొస్తున్న లులూ గ్రూప్

Lulu Group Meeting With Cha

Lulu Group Meeting With Cha

ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేసారు. అమరావతి ని రాజధానిగా ప్రకటించి హైదరాబాద్ (Hyderabad) మాదిరి అభివృద్ధి చేయాలనీ..అనేక సంస్థలను ఇక్కడ పెట్టుబడులు చేసేలా చేయాలనీ ఎంతో కృషి చేసారు. చంద్రబాబు కు ఉన్న అనుభవం చూసి అగ్ర సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత జగన్ (Jagan) అధికారంలోకి రావడం..అభివృద్ధిని పక్కన పెట్టడం..పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలతో కమిషన్ల బేరాలు ఆడడంతో చాల సంస్థలు వెనక్కు వెళ్లాయి. ఉన్న సంస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దీంతో వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదు..పెట్టుబడులు పెట్టె సంస్థలు లేక ఐదేళ్లు గడిచాయి.

ఇక ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం అవ్వడం..కేంద్ర సర్కార్ తో పొత్తులో ఉండడం తో అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అలాగే గతంలో వెళ్లిపోయిన సంస్థలు తిరిగి మళ్లీ ఏపీకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు సీఎం చంద్రబాబు తో లాలూ గ్రూప్ (Lulu Group) ప్రతినిధులు భేటీ అయ్యారు. లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. లులూ గ్రూప్ ప్రతినిధులకు ఏపీ తిరిగి స్వాగతం పలుకుతోందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. వైజాగ్ లో లులూ గ్రూప్ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే విజయవాడలో లులూ హైపర్ మార్కెట్, తిరుపతిలో లులూ మల్టీప్లెక్స్ నిర్మాణం గురించి చర్చించామని.. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని సీఎం తెలిపారు. వీటితో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ప్రోత్సాహం, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు.

Read Also : AP Politics : జగన్ ది గ్రేట్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్‌ – పోసాని..