రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju)..అంటే ఏంటో మరోసారి రుజువైంది. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) తరుపున ఎంపీగా గెలిచి, ఆ తర్వాత అదే పార్టీకి రెబెల్ గా మారాడు. వరుస పెట్టి జగన్ ను టార్గెట్ చేస్తూ వచ్చాడు..ఇక మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ లో చేరి, ఉండి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఈయనకు అంత మంత్రి పదవి వస్తుందని భావించారు కానీ..కూటమి సర్కార్ మాత్రం డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చారు. ఈరోజు రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా (Deputy Speaker of AP Assembly) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు.
ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరూ వెళ్లి రఘురామను అభినందించారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కుర్చోపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన వారంతా అదృష్టం అంటే రఘురామదే పో..అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు, చైర్ వద్దకు వెళ్లే క్రమంలో రఘురామ… చంద్రబాబుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ ను ఆత్మీయంగా హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో రఘురామ రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయ్యిందని అన్నారు. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతోందని చంద్రబాబు అన్నారు.
Read Also : Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేయలేదా?