నారా లోకేష్ (Minister Nara Lokesh)..ఇది పేరు కాదు బ్రాండ్(Minister Nara Lokesh Brand) గా మారింది. కొద్దీ రోజుల క్రితం వరకు నారా లోకేష్ అంటే సాధారణ నేత అని మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు లోకేష్ సత్తా ఏంటో తెలుస్తుండడం తో లోకేష్ సాధారణ నేత కాదు ఓ బ్రాండ్ అంటున్నారు. ఆనాడు విమర్శలు చేసిన వారే..ఈనాడు జై..జై లు పలుకుతున్నారు. తాజాగా ఏపీలో ప్రధాన మోడీ (Modi Tour) పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన పోస్టర్ లో లోకేష్ ఫొటో టాప్ లో అది కూడా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లతో సమానంగా ఉందంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలతో మాత్రమే పోస్టర్లు ఉండేవి.. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ లో లోకేష్ ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యాడ్ అందరి చేత శభాష్ అనిపించేలా చేస్తుంది.
కూటమి సర్కార్ లో లోకేష్ ప్రాముఖ్యత
కూటమి సర్కార్ లో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రభుత్వం పథకాల అమలు, విదేశీ పెట్టుబడుల రాబట్టడంలో లోకేష్ చొరవ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే లైన్ విస్తరణలో అతని కీలక పాత్ర ఉంది. గతంలో వచ్చిన విమర్శలను అధిగమించి, లోకేష్ తన సత్తా చాటుతున్న తీరు అతని నాయకత్వ లక్షణాలను స్పష్టంగా చూపిస్తోంది. తన తండ్రి చంద్రబాబు నాయుడి నాయకత్వానికి తగ్గ వారసుడిగా నిలిచిన లోకేష్, తన రాజకీయ ప్రావీణ్యంతో యువతలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఐటీ రంగం, పారిశ్రామిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకురావడానికి లోకేష్ చేసిన కృషి ప్రసంశనీయమైనది.
లోకేష్ ఆధ్వర్యంలో ఎన్నో స్టార్టప్‌లు ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబడ్డాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద కంపెనీలను రాష్ట్రంలోకి తీసుకురావడం వంటి అంశాల్లో లోకేష్ తన విశిష్టతను చాటుకుంటున్నాడు. ఐటీ, మెడికల్, ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో నూతన పెట్టుబడుల కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నాడు. టిడిపి, జనసేన, బీజేపీ కూటమిలో లోకేష్ పాత్ర సమన్వయకర్తగా ఉంది. కూటమి కార్యాచరణలలో కచ్చితత్వం, స్పష్టతను తీసుకురావడంలో అతని పాత్ర ముఖ్యమైంది. ముఖ్యంగా ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా టాప్ లీడర్‌గా లోకేష్ ప్రభావం కనిపించింది.
మోదీ పర్యటన – రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు
ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన జరిగింది. ముఖ్యంగా NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడనున్నాయి. ఇందులో నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించడం విశేషం.
ప్రాజెక్టులలో కీలక పాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు, ఔషధ పరిశ్రమలు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులపై లోకేష్ పనితనం అందరినీ ఆకట్టుకుంటోంది. కూటమి సర్కార్ లో లోకేష్ ఉన్నత స్థానానికి ఎదిగిన తీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
రాజకీయ భవిష్యత్తులో కీలకమైన లోకేష్
ఇటీవల రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, నారా లోకేష్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మరింత బలంగా నిలుస్తోంది. ఆయన నాయకత్వం కూటమి సర్కార్ లో కొత్త శక్తిని తీసుకువస్తోంది. విభిన్న రంగాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తీసుకుంటున్న చొరవ, వైజాగ్ లో మోదీ పర్యటనలో అతని పాత్ర, రాష్ట్ర ప్రజల అభిమానం పెంచే అంశాలు. నారా లోకేష్ ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలవడం ఖాయం.
ఈరోజు ప్రధాని మోడీ శంకుస్థాపన ప్రాజెక్టులు – అంచనా వ్యయం (Prime Minister Modi Foundational Projects – Estimated Cost) చూస్తే..
పూడిమడక దగ్గర NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ రూ. 1,85,000 కోట్లు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం – రూ. 149 కోట్లు
రోడ్ల నిర్మాణం / విస్తరణ (10 ప్రాజెక్టులు) రూ. 4,593 కోట్లు
కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్ రూ. 2,139 కోట్లు
6 రైల్వే ప్రాజెక్టులు రూ. 6,028 కోట్లు
నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ రూ. 1,877 కోట్లు
234.28 కి.మీ.ల రోడ్లు (7 ప్రాజెక్టులు) రూ. 3,044
323 కి.మీ.ల – 3 రైల్నే లైన్లు 12 రాయలసీమ ప్రాజెక్టులు) రూ. 5,718 కోట్లు.
ప్రస్తుతం మోడీ పర్యటన సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. విశాఖలో మోదీకి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి , ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం వరకు ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సైతం పాల్గొన్నారు.