Site icon HashtagU Telugu

AP Investor Roadshow : లండన్ లో లోకేష్ నిర్వహించిన ఇన్వెస్టర్ రోడ్‌షో గ్రాండ్ సక్సెస్

Andhra Pradesh London Roads

Andhra Pradesh London Roads

లండన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్ రోడ్‌షో (AP Investor Roadshow) విశేష విజయాన్ని సాధించింది. సీఐఐ (CII) సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో 150కి పైగా గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, రోల్స్ రాయిస్, అపోలో టైర్స్, అర్సెలర్ మిట్టల్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ వేదికపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ & హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల భవిష్యత్ మార్గరేఖను ఆవిష్కరించారు. కేవలం 15 నెలల్లోనే రాష్ట్రం రూ. 10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందని, భూకేటాయింపులు, ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు.

Tollywood : టాలీవుడ్ కు ఊపిరి పోసిన చిన్న చిత్రాలు

లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకత “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఉందని, వేగవంతమైన అనుమతులు, పారదర్శక భూకేటాయింపులు, ప్రొయాక్టివ్ ఫెసిలిటేషన్ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ ఆధారిత ఆవిష్కరణల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌర, గాలి, పంప్ స్టోరేజ్ వనరులతో 100% రిన్యూవబుల్ ఎనర్జీ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను సృష్టించగల ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేష్ పేర్కొన్నారు.

Jobs in ECIL : ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

సీఐఐ ప్రతినిధులు కూడా ఈ రోడ్‌షోను అత్యంత విజయవంతమైనదిగా పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల కోసం అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా ఎదుగుతోందని అన్నారు. ఈ రోడ్‌షో ద్వారా భారత్–యూకే ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వారు అభిప్రాయపడ్డారు. రాబోయే నవంబర్‌లో విశాఖపట్నంలో జరగబోయే CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఇది పెద్ద పునాదిగా నిలిచిందని వారు పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచ వ్యాప్తంగా సీఈఓలు, పాలసీ మేకర్లు, ఆలోచనాపరులు పాల్గొని వాణిజ్యం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. ఈ విధంగా లండన్ రోడ్‌షో ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ పెట్టుబడి ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.