Pawan Kalyan : నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ – నారా లోకేష్

రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్

Published By: HashtagU Telugu Desk
Lokesh Pawan Bday

Lokesh Pawan Bday

పవర్ స్టార్ , జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రజలు, టీడీపీ , జనసేన శ్రేణులు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ..పవన్ కు బెస్ట్ విషెష్ అందజేశారు.

‘రియల్ హీరో పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుని పవర్ స్టార్‌గా నిలిచావు. రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు… ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే పవన్ అన్న’ అని ట్వీట్ చేశారు.

అలాగే చిరంజీవి , చంద్రబాబు , అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ తదితరులు ట్వీట్స్ చేసారు.

” కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ” అని రాసుకొచ్చారు.

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని మెగాబ్రదర్ నాగబాబు అన్నారు. ‘జెండా పట్టిన జనసైనికులకి, నమ్మి నడిచిన నాయకులకి, నువ్వొస్తే మార్పు తెస్తావ్ అని ఎదురుచూసే నాలాంటి ఎంతో మందికి ఈ ఏడాది మర్చిపోలేని బహుమానం లభించింది. ఉన్నత విలువలున్నవాడు డిప్యూటీ సీఎంగా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి మరీ ప్రత్యేకం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు జనసేనాని’ అని ట్వీట్ చేశారు.

‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

“చిన్నప్పుడు తన బాబాయ్ కాళ్లు నొక్కుతుండగా తీసిన ఫొటోను వరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సహాయం చేయాలనే మీ అచంచలమైన సంకల్పం స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ మై పవర్ స్టార్మ్! అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 02 Sep 2024, 07:39 PM IST