Site icon HashtagU Telugu

Lokesh : పవన్ విషయంలో తప్పు చేసిన లోకేష్

Pawan Lokesh Tweet

Pawan Lokesh Tweet

ప్రస్తుతం సోషల్ మీడియా ను ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు తాము చేసిన అభివృద్ధి , చేసిన పనులు ఇలా ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ప్రజల్లో నిలుస్తున్నారు. కొన్ని సార్లు తెలియక చేసిన తప్పులు వారిని వార్తల్లో నిలిచేలా చేస్తాయి. అలాగే అప్పుడప్పుడు తప్పుడు పోస్ట్ లు చేసి , వాటిని వెంటనే సరిద్దికోవడం చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయంలో నారా లోకేష్ అదే చేసాడు. తాజాగా నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేసిన ఒక అంశం ఈ విషయానికి మంచి ఉదాహరణగా నిలిచింది. కడపలో నిర్మించిన ‘స్మార్ట్ కిచెన్’ (Smart kitchen) గురించి లోకేష్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి రోజు 12 ప్రభుత్వ పాఠశాలలకు, 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఇదే తరహాలో మరిన్ని స్మార్ట్ కిచెన్లు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.

Jasprit Bumrah: బౌల‌ర్ బుమ్రా ఎందుకు తరచూ గాయపడుతున్నాడు?

అయితే కాసేపటికే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వచ్చింది. గత ఏడాది మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన పర్యటనలో జిల్లా కలెక్టర్ సూచించిన ‘స్మార్ట్ కిచెన్’ ఆలోచనకు, అవసరమైన నిధులను తన వ్యక్తిగత ఖర్చుతో అందించానని పవన్ స్పష్టం చేశారు. ఈ కిచెన్ నుంచే ఇప్పుడు 12 పాఠశాలలకు ఆహారం తయారవుతుందని, ఇది ఆదర్శంగా నిలుస్తుందంటూ పవన్ వివరించారు. వాస్తవానికి ఈ స్మార్ట్ కిచన్ కు డబ్బంతా పవన్ కళ్యాణ్ ఇస్తుండగా..లోకేష్ ఆయన పేరు ప్రస్తావించకపోయేసరికి పవన్ టీం ఆ విధంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది.

ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ తన ట్వీట్‌ను తక్షణమే డిలీట్ చేయించేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల సోషల్ మీడియా అకౌంట్లను ఎక్కువగా మేనేజ్‌మెంట్ టీములు చూస్తుంటాయి. అప్పుడప్పుడు వారు పంపిన సమాచారం పూర్తిగా పరిశీలించకుండా ట్వీట్ చేసి వివాదానికి తెరలేపుతుంటారు. అయితే లోకేష్ ఈ విషయాన్ని గుర్తించి వెంటనే స్పందించటం, రాజకీయాల్లో బాధ్యతాయుతమైన ఆచరణగా అభివర్ణించవచ్చు. పవన్ కల్యాణ్ ఇచ్చిన నిధుల ప్రస్తావన లేకుండా పోవడం వల్ల జరిగిన ఈ చిన్న అపార్థం, చివరికి పరస్పర గౌరవాన్ని కాపాడే చర్యలతో ముగిసింది.

Lokesh Kichen Tweet