Lokesh VS Amarnath War : ఏపీలో తారాస్థాయికి చేరిన కోడిగుడ్డు-ముద్దపప్పు వివాదం

ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల (TDP Vs YCP) మధ్య మాటల యుద్ధమే కాదు..ప్లెక్సీ ల యుద్ధం (Plexi Controversy) కూడా తారాస్థాయికి చేరుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ తగ్గిదేలే అంటూ ప్లెక్సీలు కడుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. విశాఖపట్టణంలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌(Gudivada Amarnath)కు ఊహించని […]

Published By: HashtagU Telugu Desk
Ap Kodigudduvspappu

Ap Kodigudduvspappu

ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల (TDP Vs YCP) మధ్య మాటల యుద్ధమే కాదు..ప్లెక్సీ ల యుద్ధం (Plexi Controversy) కూడా తారాస్థాయికి చేరుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ తగ్గిదేలే అంటూ ప్లెక్సీలు కడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

విశాఖపట్టణంలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌(Gudivada Amarnath)కు ఊహించని కానుక ప్రకటించారు. ‘మీ శాసన సభ్యుడికి ఒక కానుక తీసుకువచ్చా. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసిన మంత్రికి కోడిగుడ్డు ఇవ్వాలనుకుంటున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసిన గుడివాడ అమర్‌నాథ్‌కు పంపించాలని కోరుతున్నా’ అని చెప్పి కోడిగుడ్ల డబ్బాను చూపించారు. దీనికి కౌంటర్ గా గుడివాడ అమర్ నాద్.. మట్టికుండలో ముద్ద పప్పు వండి లోకేశ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘ఎవరైనా గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఉత్తరాంధ్ర ప్రజల సంప్రదాయం. మింది గ్రామంలోని కుమ్మరులు మట్టికుండలో లోకేష్ కు ఇష్టమైన ముద్దపప్పును తయారుచేసి లోకేశ్‌కు పంపిస్తున్నా. ఉత్తరాంధ్రను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వదిలేసిన ఈ తండ్రీకొడుకులు సిగ్గు లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి మాపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉంది. వారికి సిగ్గు వచ్చేందుకు ఈ పప్పులో ఉప్పు, కారం కలిపాం’ అని మంత్రి అమర్నాథ్ అన్నారు.

ఇక ఇప్పుడు ఏకంగా ఇరువురు నేతల అభిమానులు కోడిగుడ్డు , ముద్దపప్పు అంటూ ప్లెక్సీ లు ఏర్పాటు చేస్తూ వివాదాన్ని మరింత పెంచుతున్నారు. తాజాగా సిరిపురం జంక్షన్ వద్ద టీడీపీ కార్యకర్తలు మంత్రి అమర్నాథ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కోడిగుడ్లతో కొట్టారు. దీనికి కౌంటర్ గా వైసీపీ శ్రేణులు నారా లోకేశ్ ఫ్లెక్సీకి పప్పు అభిషేకం చేశాయి. దీంతో నగరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ కోడిగుడ్డు , ముద్దపప్పు గా మారింది. మరి ప్లెక్సీ లతోనే పూర్తిచేస్తారు..రోడ్ల మీదకు వచ్చి కోడిగుడ్లతో , పప్పుతో వంట వార్పు ఏమైనా చేస్తారా..? అనేది చూడాలి.

Read Also : Medaram : మేడారం జాతరలో విషాదం..ఇద్దరు భక్తులు మృతి

  Last Updated: 22 Feb 2024, 08:55 PM IST