Site icon HashtagU Telugu

Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య

Yuvagalam Navasakam

Yuvagalam Navasakam

Yuvagalam NavaSakam: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ను గద్దె దించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నేతృత్వంలో యువనాయకుడు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు. ఈ రోజుతో పాదయాత్ర ముగిసిన కారణంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ నిర్వహించారు. భారీగా జనం వస్తున్న నేపథ్యంలో అత్యంత భద్రత ఏర్పాట్లు చేశారు.

సభ కొద్దీ సేపటిక్రితమే ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి-జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దాంతో సభా ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు నిర్వహిస్తుండగా సుమారు 5, 6 లక్షల మoది హాజరవుతారని అంచనా..50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇక స్టేజీపై 600 మంది కూర్చునే విధంగా, అలాగే 8 అడుగుల ఎత్తు స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ హాజరయ్యారు. వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబుకు మరోవైపు అచ్చెన్నాయుడు కూర్చున్నారు.పార్టీ సీనియర్ లీడర్లు స్టేజిని పంచుకున్నారు. విశేషం ఏంటంటే సుమారు పది సంవత్సరాల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు. పొత్తు నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఎన్నికల బరిలో దిగనున్నారు. మరి ఇరు పార్టీల నేతలు ఎలాంటి ప్రకటనలు చేస్తారో అన్న సందేహం నెలకొంది.

Also Read: Pot Tips : చేతిలో డబ్బు నిలవడం లేదా..? అయితే మట్టి కలశం తో ఇలా చేయాల్సిందే..