తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మహానాడు సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఈ సారి కడపలో మహానాడు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. “దేవుని కడప” అని పిలిచే ఈ పవిత్ర భూమిలో మహానాడు జరగడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒంటిమిట్ట, అమీన్‌పీర్ దర్గా వంటి ప్రసిద్ధి గల స్థలాలు ఉన్న ఈ భూమిని పౌరుషానికి, ఆత్మీయతకు నిలయంగా పేర్కొన్నారు.
Electricity Bill: కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అయితే ఈ తప్పు చేస్తున్నారేమో చూడండి!
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చరిత్రను తిరగరాశిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పార్టీ కార్యకర్తల ఏకతాటిపై కృషికి ఫలితమని చెప్పారు. విపక్షాలపై విరుచుకుపడుతూ, “వై నాట్ 175” అని ధీమా చెప్పినవారే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. ప్రజలు విపక్షానికి హోదా కూడా ఇవ్వకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు గారిని అన్యాయంగా జైలులో పెట్టినా, ప్రజలు జగన్ పాలనకు తాళం వేశారని విమర్శించారు.
తెలుగుదేశం నేతలు ఎప్పుడూ ట్రెండ్ ఫాలో కాదని, ట్రెండ్ సెట్ చేసే వారు అని లోకేశ్ గర్వంగా తెలిపారు. నందమూరి తారక రామారావు పేరు కేవలం మూడు అక్షరాలే కాదు, ఒక ప్రభంజనం అని అభివర్ణించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని, మద్యం కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వం అన్ని హామీలను నిలబెట్టుకుంటుందని, అభివృద్ధి వికేంద్రీకరణనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.