అక్రమ కేసులో తన తండ్రి (Chandrababu)ని అరెస్ట్ చేయడం..బెయిల్ కూడా రాకుండా చేస్తుండడం తో నారా లోకేష్..అధికార పార్టీ ఫై రగిలిపోతున్నాడు. వైసీపీ చేస్తున్న వాటికీ వడ్డీతో కలిపి మూల్యం చెల్లించాలని..అందుకు ఎక్కడ తగ్గకూడదని గట్టిగా ఫిక్స్ అవుతున్నాడు. వైసీపీ అక్రమాలను దేశం మొత్తం మాట్లాడుకోవాలని, చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలని ఆయన ఢిల్లీ వేదికగా గళం విప్పుతున్నారు. వరుస పెట్టి అక్కడి మీడియా చానెల్స్ తో ఇంటర్వూస్ ఇస్తున్నాడు.
తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ..చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్(Skill Development Case) కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై పోరాడుతున్నామని .. హైకోర్టులో న్యాయం జరగపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని లోకేష్ తెలిపారు. కొన్ని సార్లు న్యాయం జరగడానికి ఆలస్యం కావొచ్చు కానీ..ఆలసమైన తప్పకుండా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also : AP : అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ ప్రెస్ నోట్ వైరల్..అందులో ఏముందంటే !
రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ రాక్షస పాలన సాగిస్తుందని , త్వరలో తనను కూడా అరెస్ట్ చేస్తారంటూ.. వైసీపీ టీడీపీ పార్టీని భయాందోళనకు గురి చేయాలని కుట్రలు పడుతున్నారని లోకేష్ కామెంట్స్ చేశారు. వైసీపీ దుర్మార్గపు ఆలోచనలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena Chief Pawan Kalyan) కూడా బలైయ్యారని అన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు వస్తున్న జనసేన అధినేత పవన్ ను పోలీసులు అడ్డుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని లోకేష్ ఈ సందర్బంగా గుర్తు చేసారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని ధీమ వ్యక్తం చేశారు.