గల్ఫ్ దేశాలకు (Gulf Countries) ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందుల్లో పడుతున్న వారిని రక్షించడంలో మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) మరోసారి తన చొరవను ప్రదర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)కి చెందిన షేక్ రషీద (Sheikh Rashida) అనే మహిళ ఖతర్‌లో తన యజమానుల చేత అనేక హింసలు ఎదుర్కొంది. తినడానికి తిండి, తాగడానికి నీళ్లూ లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న ఆమె, తన బాధను వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది.
Shriya Saran Dance Viral : ఆ నడుముకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరడంతో వెంటనే స్పందించారు. ఖతర్‌లోని అధికారులతో మాట్లాడి, రషీదను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఎడారి దేశాల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో లోకేశ్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. రషీద కుటుంబ సభ్యులు రెండుసార్లు విమాన టికెట్లు పంపినా కూడా ఏజెంట్లు స్పందించకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన సహాయం చేశారు. ఆదివారం తెల్లవారుజామున రషీద హైదరాబాద్ చేరి, అక్కడ నుంచి కదిరికి బయలుదేరింది.
తాను క్షేమంగా ఇంటికి చేరడంపై రషీద ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి లోకేశ్‌కు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ తన చొరవతో బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారికీ ప్రభుత్వం మరింత చొరవ చూపించాలని ప్రజలు కోరుతున్నారు. లోకేశ్ తక్షణ స్పందన, సత్వర చర్యలు మరోసారి ప్రజల మన్ననలు పొందాయి.
Noted. I’ll do everything possible to bring her back home safely.@OfficeofNL https://t.co/EYrsNxCIu2
— Lokesh Nara (@naralokesh) January 3, 2025