Site icon HashtagU Telugu

Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్

Lokesh Kurchi

Lokesh Kurchi

గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో..ఇప్పుడు ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో అంత పాపులర్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..లోకేష్ బాబు (Lokesh) లు ఈ డైలాగ్ తో జగన్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటి సీఎం వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ డైలాగ్ చెప్పడం కాదు.. ఏకంగా కుర్చీని మడతపెట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు సభలు, సమావేశాలతో బిజీ గా మారారు. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్..ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతుండగా..చంద్రబాబు రా కదలిరా అంటూ జనాల్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం శంఖారావం పేరుతో ప్రజలను కలుస్తున్నాడు. వారం రోజులుగా యాత్ర చేస్తున్న లోకేష్..టీడీపీ – జనసేన కార్యకర్తల్లో జోష్ నింపుతూ..టీడీపీ కూటమి వస్తే ఎలాంటి మంచి జరుగుతుందో వివరిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో వైసీపీ ఫై విమర్శలు కురిపిస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు విజయనగరం జిల్లా నెలిమర్లలో జరిగిన శంఖారావం సభలో మాట్లాడుతూ.. కుర్చీ మడతపెట్టీ జగన్‌కు సీఎం కుర్చీలేకుండా చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. శాంపిల్‌గా ఓ కుర్చీని మడతపెట్టీ మరీ చూపించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు సభ ప్రాంగణం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. రాజధాని ప్రాంత రైతులంటే సీఎంకు భయమని వంచేందుకే రాజధాని ఫైల్స్ సినిమా వస్తుంటే జగన్‌కు భయమేస్తుందని అన్నారు. అందుకే ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వద్దకు పోలీసులను పంపారన్నారు. ఉన్న రాజధాని నగరాన్ని కాదని మూడు రాజధానులన్నారన్నారు. కనీసం ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. ఇలాంటి డ్రామాలకు ప్రజలే బుద్ధిచెప్తారన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ మచ్చ తేవాలనుకున్నారని.. ప్రపంచం అంతా చంద్రబాబు అభిమానులు ఎంత మంది ఉన్నారో జగన్ కుట్రతో తేలిపోయిందన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్‌.. ఇప్పుడేం చెబుతారు? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఆ దుకాణాల దగ్గర చర్చ పెట్టుకుందామంటూ సవాల్ చేశారు.. అక్కడికి వచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అధికారులను నియమించి టార్గెట్‌ పెడుతోందని.. ఐదేళ్లుగా విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారన్నారు.

Read Also : ‘Delhi Chalo’ Protest :’ఢిల్లీ చలో’ కార్యక్రమంలో విషాదం