Site icon HashtagU Telugu

AP Cabinet : మంత్రివర్గంలో లోకేష్ మార్క్

Lokesh Mark

Lokesh Mark

ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో మరికాసేపట్లో 4 వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. అయితే నిన్నటి వరకు కూడా మంత్రి వర్గ ఏర్పాటు ఫై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉండే..ఈసారి పెద్ద ఎత్తున సీనియర్ నేతలతో పాటు యువ నేతలు విజయం సాధించడం తో ఎవరికీ మంత్రి పదవులు దక్కుతాయో..? చంద్రబాబు సీనియర్లకు మొగ్గు చూపిస్తాడా..? లేక యువ నేతలకు మొగ్గు చూపిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. అయితే బాబు మాత్రం ఈసారి మొదటగా విజయం సాధించిన 17 మందికి మంత్రి పదవులు అప్పగించి సంచలనం సృష్టించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో 7/1 ఫార్ములా పాటించారు. అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు. ఈ క్రమంలో 133 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు(పవన్ డిప్యూటీ సీఎం), 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు.అయితే ఈ మంత్రివర్గ కూర్పులో నారా లోకేష్ తన మార్క్ కనపరిచారని అంటున్నారు.

ఏపీ అభివృద్ధి కోసం మరో ఇరవై ఏళ్ల దీర్ఘదృష్టితో పాలనా ఎజెండా ఖరారు చేసుకున్న చంద్రబాబు..దానికి తగ్గట్లే కేబినెట్ లో గతంలో మంత్రి పదవులు నిర్వర్తించిన కొద్దిమంది సీనియర్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని..భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా జూనియర్లను సైతం ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతోనే కొత్త వారికి కేబినెట్ లో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా.. టీడీపీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన యువనేతలకు గుర్తింపు ఇవ్వాలని జూనియర్లకు ఈ కేబినెట్ లో బెర్త్ ఖరారు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ,ఇప్పటికే చంద్రబాబు తర్వాత లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే లోకేష్ ప్రభుత్వంలోనూ పట్టు సాధించేందుకు ఈ కేబినెట్ కూర్పు జరిగి ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మంత్రివర్గ ఏర్పాటులో లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also : BJP President: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి.. రేసులో ఈ ముగ్గురు మాత్రమే..!