ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’, ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఈ విషయంపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
TG – Medical & Health Department : నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
మంత్రివర్గ సమావేశానికి ముందు జరిగిన అంతర్గత సమావేశంలో లోకేశ్ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు గుర్తింపు వస్తుంటే, కొందరు ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను, ప్రణాళికలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Happy Birthday : ‘విశ్వంభర’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. గాడి తప్పిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ హెచ్చరించారు. ఈ నిర్ణయం ద్వారా ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను పెంచడంలో ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కావాలని, వివాదాలకు దూరంగా ఉండాలని ఈ ప్రకటన ద్వారా పరోక్షంగా సందేశం పంపారు.