ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను ఆహ్వానిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేశ్, రాజు వేగేశ్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ ప్రాజెక్టులను అమలు చేసే అవకాశాలపై లోకేశ్ వివరంగా అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని రాజుకు వివరించారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలన, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఏపీలో ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.
YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సిఫీ టెక్నాలజీస్ తమ పెట్టుబడులకు ఏపీ అనువైన గమ్యస్థానమని భావిస్తున్నట్లు రాజు వేగేశ్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మద్దతు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తమను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. డేటా సెంటర్ల రంగంలో ఏపీకి మంచి అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా కీలక చర్చలు జరుపుతున్నారు. సిఫీ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడితే, డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.