ఏపీలో పలు జిల్లాల్లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాయలసీమలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతూ గతం తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు పలు దాడులు జరిపిన వారు..నిన్నటి నుండి వరుసగా దాడులకు తెగపడుతున్నారు. టీడీపీ నేతలపైనే కాదు పార్టీ కార్యకర్తలపై , మహిళలపై , ఆఖరికి గర్భిణీ స్ర్త్రీలఫై కూడా దాడి చేస్తూ రాక్షసులుగా మారుతున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ జరగడం..అన్ని సర్వేలు మాత్రమే కాదు ఓటర్లు సైతం కూటమి విజయం ఖాయమని చెపుతుండడంతో వైసీపీ లో ఓటమి భయం మొదలైందని..అందుకే ఇలా నరరూప రాక్షసులుగా మారారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లాలోని పెళ్లకూరుమిట్టకు చెందిన మహిళపై గర్భిణి అని చూడకుండా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా చేసిన వైసీపీకి పతనం ఖాయమన్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఒక్క తిరుపతి జిల్లాలోనే కాదు పల్నాడు , తాడిపత్రి , బాపట్ల మొదలగు జిల్లాలో వైసీపీ నేతల దాడుల్లో అనేక మంది టీడీపీ శ్రేణులు గాయపడి హాస్పటల్స్ లలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి కూడా ఆందోళన కారణంగా ఉంది. ప్రజాస్వామ్యంలో గెలుపు , ఓటములు అనేది కామన్..దానికి ఇలా తెగపడడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అంత వాపోతున్నారు. పార్టీల అధినేత, ముఖ్య నేతలు బాగానే ఉన్నప్పటికీ మీలో మీరెందుకు ఇలా కొట్టుక చంచస్తారని అంత ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ గొడవలు మానేసి మనుషుల్లాగా బ్రతకండి అంటున్నారు.
వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసింది. టిడిపికి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైసిపి మూకల అమానుష దాడి దారుణం. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసిపి పతనం ఖాయం. గర్భిణీకి మెరుగైన వైద్యం… pic.twitter.com/FsHMev4WsS
— Lokesh Nara (@naralokesh) May 15, 2024
Read Also : Yellow Urine: ఈ 5 కారణాల వలన మీ మూత్రం పసుపు రంగులోకి మారుతుందట.. బీ అలర్ట్..!