Nara Lokesh : బీసీల ద్రోహి వైఎస్ జగన్ – నారా లోకేష్

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 07:26 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..ఎంతో ఉత్సహంగా యువగళం (Yuvagalam) పాదయాత్రను పూర్తి చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ..జగన్ సర్కార్ (YCP Govt) ఫై విమర్శలు చేస్తూ వెళ్తున్నారు. తాజాగా మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గం దేవవరంలో యువగళం యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..వైఎస్ జగన్ పాలనలో బీసీ (BC) సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని, బీసీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బీసీల ద్రోహి వైఎస్ జగన్ అని విమర్శించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించిన బీసీ సోదరులను దారుణంగా హతమార్చారు అని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘ఉత్తరాంధ్ర యాదవ సామాజికవర్గం ప్రజలు విద్య, ఆర్థిక, సామాజికంకగా చాలా వెనుకబడ్డాం. గొర్రెలు పెంపకం మా కుల వృత్తి. ఉత్తరాంధ్ర యాదవులను బిసీ-డి గ్రూపు నుండి బీసీ-బి గ్రూపులో చేర్చాలి. 50శాతం సబ్సిడీతో గొర్రెలు పెంపకందారులకు సబ్సిడీపై గొర్రెలు ఇప్పించాలి. 50ఏళ్లు నిండిన గొర్రెలు పెంపకందారులకు పెన్షన్ మంజూరు చేయాలి. గొర్రెలు పెంపకందారులకు రూ.10లక్షలు బీమా అందించాలి’ అని నారా లోకేశ్‌ని బీసీలు కోరారు. వైసీపీ పాలనలో మహిళల భద్రత గాలిలో దీపంలా తయారైందని చెప్పుకొచ్చారు. లేని దిశాచట్టం పేరుతో మహిళలను జగన్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తోంది అని మండిపడ్డారు. పట్టపగలే మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈశాన్యరాష్ట్రాల తరహాలో మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మహిళల కష్టాలు తీర్చడానికి మహాశక్తి పథకాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిమహిళకు నెలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.2500 రూపాయల సాయంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు.

Read Also : High Tension at Yashoda Hospital : సోమాజిగూడ యశోద హాస్పటల్ వద్ద ఉద్రిక్తత ..