Lokesh Effect : కేశినేని ఔట్ !విజ‌య‌వాడ బ‌రిలో ల‌గ‌డ‌పాటి?

Lokesh Effect : తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ స‌భ‌లో ముగ్గురు. మూడు సింహాల మాదిరిగా పోరాడుతున్నార‌ని అప్ప‌ట్లో వినిపించిన మాట‌.

  • Written By:
  • Updated On - September 8, 2023 / 01:57 PM IST

Lokesh Effect : తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ స‌భ‌లో ముగ్గురు. మూడు సింహాల మాదిరిగా పోరాడుతున్నార‌ని అప్ప‌ట్లో వినిపించిన మాట‌. ఆ త‌రువాత కేశినేని నాని, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వాయిస్ త‌గ్గింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మాత్రం లోకేష్ టీమ్ లో చురుగ్గా ఉన్నారు. ఆయ‌న మీద కూడా లోకేష్ ఇటీవ‌ల సెటైర్ వేశారు. ఒంటరిగా యువ‌గ‌ళంలో వ‌దిలేశాడంటూ కిడ్డింగ్ చేశారు. కానీ, రాజ‌కీయంగా మాత్రం ఆ వ్యాఖ్య పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో సీరియ‌స్ గా చ‌ర్చ న‌డుస్తోంది.

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ను రంగంలోకి దింప‌డం,.(Lokesh Effect)

లోక్ స‌భ కు పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబు క్లారిటీగా ఉన్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో 25 స్థానాల‌కు 25 గెల‌వాల‌ని ముందుగానే అభ్య‌ర్థుల విష‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పారిశ్రామిక‌వేత్త‌లు, వాణిజ్య‌వేత్త‌లు, విద్యావేత్త‌లు చాలా మంది హైద‌రాబాద్ లోని చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. ఎంపీ అభ్య‌ర్థిత్వాల‌ను ఆశిస్తున్నారు. స‌ర్వేల ఆధారంగా మాత్ర‌మే టిక్కెట్ల‌ను కేటాయించడానికి సిద్ధ‌ప‌డ్డ చంద్ర‌బాబు చాప‌కింద నీరులా త‌న‌ప‌ని తాను చేస్తున్నారు. ఆ క్ర‌మంలో సిట్టింగ్ ఎంపీల‌ను (Lokesh Effect) కూడా ప‌క్క‌న పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

లోక్ స‌భ కు పోటీ చేసే అభ్య‌ర్థుల విష‌యంలో చంద్ర‌బాబు క్లారిటీ

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఎంపీగా కేశినేని శ్రీనివాస‌రావు అలియాస్ నాని ఉన్నారు. ఆయ‌న గ‌త రెండేళ్లుగా పార్టీ అధినేత‌ను, పార్టీని ఇబ్బంది పెట్టేలా ప‌లు సందర్భాల్లో వ్య‌వ‌హ‌రించారు. సాక్షాత్తు చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా బొకే ఇచ్చే విష‌యంలోనూ గ‌ల్లా, కేశినేని మ‌ధ్య చిన్న‌పాటి స‌మ‌న్వ‌యం లేకుండా పోయింది. అంతేకాదు, లోక్ స‌భ‌లో టీడీపీ త‌రపున ఫ్లోర్ లీడ‌ర్ గా చేయ‌లేద‌ని కేశినేని అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో అస‌హ‌నం వ్య‌క్త‌ప‌రిచారు. అంతేకాదు, లోకేష్ కోట‌రీలో లీడ‌ర్ గా రామ్మోహ‌న్ నాయుడును చూస్తూ ప‌లు విమ‌ర్శ‌లు ప‌రోక్షంగా చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అందుకే, ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగాల‌ని యోచిస్తున్నారు. అయితే, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడుగా ఉన్న అచ్చెంనాయుడు మాత్రం (Lokesh Effect) అడ్డుప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

ఫ్లోర్ లీడ‌ర్ గా చేయ‌లేద‌ని కేశినేని అక్క‌సు

గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ స్వ‌త‌హాగా పారిశ్రామిక‌వేత్త‌. రెండోసారి గుంటూరు నుంచి ఎంపీగా 2019 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఆ త‌రువాత ఆయ‌న ప‌లు ఇబ్బందుల‌ను వైసీపీ నుంచి ఎదుర్కొన్నారు. పార్టీ మార‌బోతున్నారు అనే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ, ఆయ‌న సైలెంట్ గా త‌న‌ప‌ని తాను చేసుకుపోతున్నారు. ఏపీ స‌మ‌స్య‌ల‌పై లోక్ స‌భ వేదిక‌గా గ‌ళం విప్పుతారు. మిగిలిన రోజుల్లో వ్యాపారంలో బిజీగా ఉంటారు. ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం దెబ్బ‌కు చిత్తూరు నుంచి ఫ్యాక్ట‌రీని త‌ర‌లించారు. త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కంపెనీ విస్త‌ర‌ణ చేప‌ట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి త‌ల‌వంచ‌కుండా రాజ‌కీయాలు చేస్తున్నారు. మ‌రోసారి ఆయ‌న గుంటూరు నుంచి పోటీకి దిగే అవ‌కాశం ఉంది.

రామ్మోహ‌న్ నాయుడు పూర్తిగా లోకేష్ కోట‌రీ

ఇక శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహ‌న్ నాయుడు పూర్తిగా లోకేష్ కోట‌రీ లీడ‌ర్. ఆయ‌న ఈసారి అసెంబ్లీకి రావాల‌ని భావిస్తున్నారు. పైగా పార్ల‌మెంటరీపార్టీ నాయ‌కునిగా స‌మ‌న్వ‌యం చేసుకోలేక‌పోతున్నారు. ఎందుకంటే, గ‌ల్లా, కేశినేని ఇద్ద‌రు స్ట్రాంగ్ లీడ‌ర్లు. వాళ్లతో సమ‌న్వ‌యం ఆయ‌న‌కు ఇబ్బంది క‌రంగా ఉంది. అయితే, ఈసారి కేశినేనికి టిక్కెట్ క‌ష్ట‌మ‌ని టాక్. ఆయ‌న స్థానంలో ఈసారి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ విజ‌య‌వాడ ఎంపీగా బ‌రిలోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న ర‌హ‌స్యంగా అనుచ‌రుల‌తో మీటింగ్ లు పెట్టుకున్నారు. ప‌లు కోణాల నుంచి స‌ర్వేలు చేయించారు. ఆ రిపోర్టుల‌ను చంద్ర‌బాబుకు అంద‌చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న కేశినేనికి మ‌రోసారి అవ‌కాశం ఇస్తే పార్టీ  న‌ష్ట‌పోతుంద‌ని స‌ర్వే (Lokesh Effect) సారాంశ‌మ‌ట‌.

Also Read : Posani – Lokesh : తనను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర – పోసాని

విజ‌య‌వాడ ప‌రిధిలోని లీడ‌ర్ల‌కు, కేశినేనికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేదు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రిదోవ వాళ్ల‌దే అన్న‌ట్టు ప్ర‌చారం చేశారు. ఆ త‌రువాత కూడా అక్క‌డి నాయ‌కుల‌తో కేశినేని ఎప్పుడూ క‌లిసి లేరు. పైగా లోక్ స‌భ ప‌రిధిలోని వైసీపీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఇటీవ‌ల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇవ‌న్నీ పార్టీకి న‌ష్టం క‌లిగించే అంశాలుగా అధిష్టానం భావిస్తోంది. అందుకే, సైలెంట్ గా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించింది.

రాబోవు ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ను రంగంలోకి దింప‌డం ద్వారా ఎమ్మెల్యేల‌ను గెలుచుకోవ‌డం ఈజీగా ఉండ‌డ‌మే కాకుండా ఆయన ఎంపీగా విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వేలు చెబుతున్నాయ‌ట‌. ఆ విష‌యాన్ని తెలుసుకున్న కేశినేని ఇప్పుడు చంద్ర‌బాబును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. తాను టీడీపీని వీడ‌నంటూ ప్ర‌క‌టించారు. ఒక వేళ పార్టీలోనే ఉంటే మాత్రం ఆయ‌న‌కు ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది. అంతేగాని, విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా ఈసారి ఆయన‌కు అవ‌కాశం ఇచ్చే ఆస్కారం లేద‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : TDP Manifesto: చంద్రబాబు దూకుడు.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో!