Nara Lokesh: మీరు పోలీసులా.. వైసీపీకి అనుచరులా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Lokesh 1

Lokesh 1

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అంటూ పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పాపానికి శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగికి చెందిన టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించారని, బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతిని ప్రశ్నించినవాళ్లను చంపుకుంటూపోతే ఏపీలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వెంకటరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదు అని నారా లోకేశ్ హెచ్చరించారు.

  Last Updated: 08 Mar 2022, 11:49 AM IST