AP : ఏం మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్..ఓ పరదాలు ఉన్నాయ్ కదా – లోకేష్

'హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నావ్.. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్. పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు'

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Phone Tapping

Nara Lokesh

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ముఖ్యంగా టీడీపీ – వైసీపీ (TDP-YCP) నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెచుతున్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..ట్విట్టర్ వేదికగా విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

గత ఎన్నికలకు ముందు జగన్ (Jagan) ప్రచారంలో తాను అధికారం లోకి వచ్చిన తరువాత ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని.. హామీలు అన్నీ నెరవేర్చిన తరువాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మాటలను లోకేష్ గుర్తు చేసి జగన్ ఫై విరుచుకపడ్డారు. ‘హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నావ్.. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్. పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతకు ముందు కూడా విజయ రెడ్డి ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా.. విజయసాయి రెడ్డి బ్రెజిల్ లో మీకున్న చీకటి వ్యాపారాల గురించి రెండేళ్ళ క్రిందటే చెప్పాను. ఇప్పుడు అదే నిజం అయ్యింది. అనే ట్యాగ్ లైన్ తో వీడియోని పోస్ట్ చేశారు. విజయసాయి లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో, లేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ఈయన పాత్ర బయటపడుతుందో అనే భయం ఆయనకు పట్టుకుందని పేర్కొన్నారు.

అందుకే తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి రెడ్డి, దీనితో యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీసు డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు విజయసాయి రెడ్డి ఫోన్ వెతికే పనిలో పడ్డారని ఎద్దేవ చేశారు. ఒక రాజ్య సభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డికి చాల దగ్గర వ్యక్తి, అలానే అన్నీ కుంభకోణాల్లో నెంబర్ 2 ఈయనే.. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అలోచాలి అన్నారు. వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే దొంగోడి ఇంట్లో దొంగ పడినట్లు ఉంది అని ఎద్దేవ చేశారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read Also : Godan Express : ముంబై – గోర‌ఖ్‌పూర్ గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంట‌లు

  Last Updated: 22 Mar 2024, 07:59 PM IST