Lokesh : క్యాడర్ కోసం..లోకేష్!

అధికారం ఉన్నా లేకున్నా ఒకేలా స్పందించే నాయకులు చాలా అరుదు. ఆ విషయంలో లోకేష్ చాలా తక్కువ టైం లోనే క్యాడర్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ మనసు దోచుకున్నాడు. అందుకే ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వాళ్ళ స్వానుభవాలను గిఫ్ట్ గా అభిమానులు ఇస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 23, 2022 / 01:47 PM IST

అధికారం ఉన్నా లేకున్నా ఒకేలా స్పందించే నాయకులు చాలా అరుదు. ఆ విషయంలో లోకేష్ చాలా తక్కువ టైం లోనే క్యాడర్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ మనసు దోచుకున్నాడు. అందుకే ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వాళ్ళ స్వానుభవాలను గిఫ్ట్ గా అభిమానులు ఇస్తున్నారు. ఇలాంటి ఒరవడి గతంలో చంద్రబాబుకు కూడా రాలేదు. రెండో కంటికి తెలియకుండా కొంత మందికి భారీ సహాయాలు చేసాడు. కానీ వాళ్ళు ఎవరు బయటకు చెప్పక పోగా ఆయన్ను విమర్శించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ లోకేష్ సెలక్షన్ అండ్ ఆయన చేసే సహాయం అభిమానుల మనసు దోచుకుంటుంది.
వ‌ధూవ‌రుల‌కు లోకేష్ అన్న పెళ్లికానుక‌ పేరుతో
మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఊరిలో పెళ్లి జ‌రిగినా వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దిస్తూ పెళ్లి కానుక పంపించ‌డం ఆన‌వాయితీగా ఉంది. పెళ్లికూతుర్ల‌కు సొంత అన్న‌లా పుట్టింటి నుంచి చీర పంపి ఆశీర్వ‌దించ‌డం నారా లోకేష్ సంప్ర‌దాయంగా పాటిస్తున్నారు. చాలావ‌ర‌కూ వివాహాది శుభ‌కార్యాల‌కు ఆయ‌నే నేరుగా హాజ‌ర‌వుతారు. తాను పార్టీ కార్య‌క్ర‌మాల్లో వుండి పెళ్లికి హాజ‌రు కాలేక‌పోతే..నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌తో పెళ్లికానుక పంపి వ‌ధూవ‌రుల‌ను త‌న ఆశీస్సులు అంద‌జేస్తారు. అంతేకాదు శుభ‌కార్యాల‌కూ నారా లోకేష్ అందించే చిరు కానుక అక్కడి ప్రజలకు తెలుసు.
స్వ‌యంగా ఉపాధి పొందేవారంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కి ఇష్టం. ఎవ‌రైనా తాము ఉపాధి పొందుతాం చిరుసాయం అందించాల‌ని కోరితూ వ‌చ్చిన విన‌తుల‌న్నీ ప‌రిశీలించి సహాయం అందిస్తాడు నారా లోకేష్‌. ఆ జాబితా లో రోడ్ల ప‌క్క‌న పండ్లు, కూర‌గాయ‌లు, ఇస్త్రీ బండ్లు వాళ్లే ఎక్కువున్నారు.
జ‌ర్న‌లిస్టుల‌కు కోవిడ్ వైర‌స్ విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసేందుకు ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తోపాటు క‌లిసి ప‌నిచేస్తూ క‌రోనా కోర‌ల్లో చిక్కిన రోజుకో జ‌ర్న‌లిస్టు మృత్యువాత‌ప‌డటంపై లోకేష్ స్పందించాడు. జ‌ర్న‌లిస్టుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని విన్న‌విస్తూనే త‌న‌వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌ర్న‌లిస్టులంద‌రికీ బీమా క‌ల్పించారు. బీమా పొందిన‌ జ‌ర్న‌లిస్టుల్లో ఎవ‌రైనా స‌హ‌జ మ‌ర‌ణం (కోవిడ్ వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయినా)అయితే నామినీకి 10 ల‌క్ష‌లు, ప్ర‌మాదంలో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టులు మృతి చెందితే వారి నామినీల‌కు 20 ల‌క్ష‌ల‌కు బీమా వ‌ర్తించే పాల‌సీల‌ను చేయించాడు.
తెలుగుదేశం పార్టీకి అన్నీ తామై నిలిచిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను అన్నివిధాలుగా ఆదుకునేందుకు కార్య‌క‌ర్త‌ల సంక్షేమ విభాగం నెల‌కొల్పాడు.వంద రూపాయ‌ల స‌భ్య‌త్వం చెల్లించిన టీడీపీ కార్య‌క‌ర్త‌కు ప్ర‌మాద‌భీమా, ప్ర‌మాదంలో గాయ‌ప‌డినా చికిత్స ఖ‌ర్చులు చెల్లించేలా సంక్షేమ నిధి నుంచి క్యాడర్ కు పాల‌సీలు చేయించిన లీడర్ నారా లోకేష్. దాదాపు 4529 మందికి,91 కోట్లు అందించి కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు ఆస‌రాగా నిలిచిందీ బీమా ప‌థ‌కం.కార్యకర్తల పిల్లల చదువులకు 2.50 కోట్లు,ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తల కుటుంబాలకు 15 కోట్లు అందించారు.
అధికారంలోకొ వ‌స్తే చేస్తామ‌నే డొంక‌తిరుగుడు వాగ్దానాలు ఉండవు. నేరుగా వ‌చ్చినా స‌త్వ‌ర సాయం అందించే నాయకునిగా టీడీపీ క్యాడర్ ఆరాధిస్తోంది.
మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ గా నారా లోకేష్ మారాడని టీడీపీ సంబుర పడుతుంది. అవినీతి ఆరోప‌ణ‌ల్లేని మిస్ట‌ర్ క్లీన్ గా పేరున్న‌ నారా లోకేష్‌..కొద్దిగా లావుగా వుండే త‌న రూపాన్ని మార్చుకునేందుకు లాక్‌డౌన్ టైముని స‌ద్వినియోగం చేసుకున్నాడు. డైట్ నిబంధ‌న‌లు పాటిస్తూ, నైక్ అనే యాప్ ద్వారా వ్యాయామాలు చేస్తూ 20 కేజీలు వ‌ర‌కూ త‌గ్గారు. తొలి లాక్‌డౌన్‌కి బ‌రువు త‌గ్గితే…సెకండ్ వేవ్ స‌మ‌యాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుని రోజువారీ వ్యాయామాల‌తోపాటు డైట్ క‌ఠిన‌త‌రం చేసి నాజూగ్గా తయారు అయ్యాడు.
తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యుల‌కి ఆత్మీయ‌త పంచాడు…
గుడి,మ‌సీదు,చ‌ర్చిల‌ను సంద‌ర్శించాడు….
అన్నివ‌ర్గాల‌కీ చేరువ‌య్యాడు….
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్ర‌తీ వీధీ చేరారు. ప్ర‌తీ గ‌ల్లీ తిరిగారు. మ‌నుషుల్ని క‌లిసి, వారి మ‌న‌సుల్ని గెలిచాడని పార్టీ భావిస్తుంది.
మాట‌ల తూటాల‌ నారా లోకేష్‌ అంటే ఒక‌ప్పుడు నాలిక మ‌డ‌ప‌డుతుంది. మాట‌లు త‌డ‌బ‌డి పొర‌ప‌డ‌తాడ‌ని విప‌రీత‌ప్ర‌చారం జ‌రిగింది. విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తి విమ‌ర్శ‌లు కాకుండా త‌న‌ను తాను మార్చుకోవ‌డానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నారా లోకేష్ తాను విమ‌ర్శ‌లు పాలు అవుతున్న లోపాలు గుర్తించాడు. తెలుగు భాష‌పై కూడా ప‌ట్టు సాధించారు. అప్పుడ‌ప్పుడూ త‌డ‌బ‌డి, ప‌దాలు ప‌ల‌క‌డంలో పొర‌బ‌డే నారా లోకేష్‌…ఇప్పుడు అన‌ర్ఘ‌ళంగా మాట్లాడుతున్నాడు. ఫీల్డ్ విజిట్ అయినా, ప్రెస్ మీటైనా, మీట్ ది ప్రెస్ అయినా సూటిగా సుత్తి లేకుండా స్పీచ్ అద‌ర‌గొట్టేస్తున్నాడు. ఒక చెంప మీద కొడితే మ‌రో చెంప చూప‌డానికి నేను చంద్ర‌బాబులాంటి గాంధేయ‌వాదిని కాదు…రెండు చెంప‌లూ ప‌గ‌లగొట్టే తీరుతానంటూ వార్నింగ్ లిస్తున్నాడు. ప్ర‌శ్నించ‌డ‌మే కాదు..త‌న‌ను ఎవ‌రు ప్ర‌శ్నించినా అచ్చ‌మైన తెలుగులో స్ప‌ష్టంగా సూటిగా సుత్తి లేకుండా స‌మాధానాలిస్తున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ మాట‌ల తూటాలు లోడ్ చేసిన తుపాకీ అంటూ టీడీపీ క్యాడర్ భావిస్తుంది.
కేసుల్లేని మిస్ట‌ర్ క్లీన్ నారా లోకేష్‌
తాత ఎన్టీఆర్ సంచలన ముఖ్య‌మంత్రి…తండ్రి చంద్రబాబు విజన్ ఉన్న ముఖ్య‌మంత్రి . ప్రపంచ‌ప్ర‌ఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువు వెరసి లోకేష్. యువత క‌ల‌లు క‌నే వ‌ర‌ల్డ్ బ్యాంకులో ఉద్యోగం అయినా అధికార ద‌ర్పంలేదు. అధికార దుర్వినియోగం లేదు. ఒక్క అవినీతి ఆరోప‌ణా నిరూపణ ఆయన మీద కాలేదు . త‌ప్పుడు ఆరోప‌ణ‌లపై ప‌రువున‌ష్టం దావా వేసి కోర్టుకీడ్చారు నారా లోకేష్‌. మూడుశాఖ‌ల మంత్రిగా చేసినా త‌న సొంత డ‌బ్బుతో పేషీలో సిబ్బందికి సౌక‌ర్యాలు క‌ల్పించాడు. లోకేష్‌పై వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు పెట్టిన ట్రాక్ట‌ర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు, కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసు మాత్ర‌మే నారా లోకేష్‌పై ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో వైసీపీకి తొడగొట్టి నిలబడ్డ అంజిరెడ్డి నుంచి కోవిడ్ సోకిన చాలా మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అందిన సహాయం మరువలేనిది. పాజిటివ్ వ‌చ్చి జూమ్ ఇన్‌స్టాలేష‌న్ చేసిన వారినే ఆరోగ్య వ‌లంటీర్లుగా మార్చారు. వీరి ఆధ్వ‌ర్యంలో అంద‌రికీ ప‌ల్స్ ఆక్సిమీట‌ర్‌తో ఆక్సిజ‌న్ లెవ‌ల్ చూడ‌టం, ల‌క్ష‌ణాలు క‌నుక్కోవ‌డం, థ‌ర్మామీట‌ర్‌తో టెంప‌రేచ‌ర్ చెక్ చేయ‌డం అల‌వాటు చేశారు. మామూలు ల‌క్ష‌ణాలున్న వారి చికిత్స‌, తీవ్ర‌త ఎక్కువ‌గా వున్న‌వారి చికిత్స‌లకు అవ‌స‌రమైన మందుల‌ను నారా లోకేష్ స‌మ‌కూర్చి సహాయం చేసాడు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అమెరికా వైద్యబృందం టెలీక‌న్స‌ల్టేష‌న్ ద్వారా పాజిటివ్ పేషెంట్ల‌కు చికిత్స అందించి వారంతా కోలుకునేలా ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా న‌డిచింది. సాయం చేయ‌డ‌మే కాదు..రోజూ వైద్యులు పేషెంట్ల‌తో మాట్లాడే జూమ్ కాల్‌లో వుంటూ త‌మ‌ని సొంత బంధువులా నారా లోకేష్ ఆదుకునాడు అని క్యాడర్ బర్త్ డే సందర్భంగా గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి స్పందన చూసి లోకేష్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ చంద్రబాబు అండ్ కో కూడా ఆశ్చర్యానికి లోనవుతుందని పార్టీ వర్గాల వినికిడి. మొత్తం మీద లోకేష్ బర్త్ డే మారిన ఆయన స్టయిల్ ని సూచిస్తుంది.