Lok satta with BRS : ఏపీపై కేసీఆర్ `జేపీ` అస్త్రం, బీఆర్ఎస్ తో లోక్ స‌త్తా?

లోక్ స‌త్తా పార్టీ (Lok satta) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జేపీతో

  • Written By:
  • Updated On - December 26, 2022 / 02:33 PM IST

లోక్ స‌త్తా పార్టీ (Lok satta) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌తో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏపీ వ్యూహాల‌ను ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది. చిన్న రాష్ట్రాల‌కు అనుకూలంగా జేపీ విధానం ఉంది. అలాగే, అధికార వికేంద్ర‌క‌ర‌ణ‌కు సానుకూలంగా ఆయ‌న వాయిస్ వినిపిస్తున్నారు. ఆ రెండు అంశాలు ఏపీలో రాజ‌కీయం చేయ‌డానికి అనువైన‌విగా ఉన్నాయ‌ని భావిస్తున్నారు. అలాగే రైతుల కోసం ఒక‌ప్పుడు బ‌స్తాల‌తో రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటిన లీడ‌ర్ గా జేపీకి గుర్తింపు ఉంది. ఇది, బీఆర్ఎస్(BRS) జాతీయ నినాదానికి ప‌నికొస్తుంది. సోనియాగాంధీ కోట‌రీలోని మ‌నిషిగా ఒకానొక టైమ్ లో జేపీ మీద ప్ర‌చారం జ‌రిగింది. పైగా ఏపీ రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండాల‌ని ఇటీవ‌ల ఆయ‌న భావిస్తున్నారు. అందుకే, జేపీతో(Lok satta) బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యూహాల‌ను ర‌చిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఎంట్రీ కోసం మేధావులు (Lok satta with BRS)

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ కోసం మేధావులు, సీనియ‌ర్ లీడ‌ర్లు, త‌ట‌స్థ‌లు ఈక్వేషన్ ను కేసీఆర్ ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారుగా 80 మందిని గుర్తించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా క‌త్తి ప‌ద్మారావు, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, దాడి వీర‌భ‌ద్ర‌రావు, కొణ‌తాల రామ‌క్రిష్ణ‌, జ్యోతుల నెహ్రూ, వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు, య‌ల‌మంచిలి శివాజీ, ముక్కు కాశిరెడ్డి(ప్ర‌కాశం), ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, చింతా మోహ‌న్‌, సీ రామ‌చంద్ర‌య్య త‌దిత‌రుల‌ను కేసీఆర్ అప్రోచ్ అయిన‌ట్టు వినికిడి. సంక్రాంతి త‌రువాత బీఆర్ఎస్ పార్టీతో క‌లిసి ప‌నిచేసే వాళ్ల జాబితా స్ప‌ష్టంగా బ‌య‌ట‌కు రానుంద‌ని తెలుస్తోంది. వీళ్ల‌తో పాటు తెలంగాణ ప్రాంతంలో అక్ర‌మ ఆస్తులు, బినామీల‌తో ఆస్తులు క‌లిగిన వివిధ రంగాల ప్ర‌ముఖులు, పారిశ్రామిక‌వేత్త‌ల జాబితాను కేసీఆర్ త‌యారు చేయిస్తున్నార‌ని స‌మాచారం. అంతేకాదు, మీడియాలోని కొంద‌రు అధిప‌తుల‌ను(ఏపీకి చెందిన వాళ్లు) కూడా కేసీఆర్ ట‌చ్ లోకి తీసుకున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

స‌భ్య‌త్వ న‌మోదు ఫోన్ నెంబ‌ర్ 9491015222 

ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి బీఆర్ఎస్ పార్టీ బ‌ల‌మైన గ్రౌండ్ ను కేసీఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్క‌డ స‌భ్య‌త్వ న‌మోదును ప్రారంభించింది. అందుకోసం ఫోన్ నెంబ‌ర్ 9491015222 ను ప్ర‌క‌టించింది. ఇన్సూరెన్స్ తో పాటు స‌భ్య‌త్వం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. మిస్ట్ కాల్ ఇవ్వ‌డం ద్వారా స‌భ్య‌త్వాన్ని తీసుకునే వెసుల‌బాటును క‌ల్పించింది. రాబోవు రోజుల్లో స‌భ్య‌త్వ న‌మోదు ఆధారంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ యాక్టివ్ కానుంది. ఇప్ప‌టికే ఫోన్ల ద్వారా ఏపీ లీడ‌ర్ల‌ను కేసీఆర్ సంప్ర‌దిస్తున్నారు. పార్టీ ఆఫీస్ ను సంక్రాంతి త‌రువాత ప్రారంభించ‌డానికి భ‌వ‌నాన్ని ఎంపిక చేసే ప‌నిలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

Also Read : AP BRS : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! ఆ మూడు పార్టీల‌ పొత్తు?

ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో కేసీఆర్ వేగంగా ముందుకు వెళుతున్నారు. వ్యూహాత్మ‌కంగా ఏపీలో ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌న్నాహాల‌ను ప్రారంభించారు. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోని లీడ‌ర్ల‌కు ఆయ‌న ఫోన్ చేస్తున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ల‌ను కూడా ఆయ‌న టచ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న లీడ‌ర్ల‌తో పాటు టీడీపీలో సాన్నిహిత్యం ఉన్న లీడ‌ర్ల‌తో మంత‌నాలు సాగిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర , రాయ‌ల‌సీమ మీద నుంచి ప్ర‌ధానంగా కేసీఆర్ దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌తోనూ మంత‌నాలు సాగించార‌ని వినికిడి. ఏపీలోని సామాజిక‌, ప్ర‌జా, పౌర‌, జ‌ర్న‌లిస్ట్ సంఘాల లీడ‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కావాల‌ని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌గ‌తిభ‌వన్ వ‌ర్గాల్లోని టాక్‌.

రాష్ట్రాల్లోని మీడియాతో డీల్  

తెలంగాణ ఉద్య‌మం కంటే ఉదృతంగా జాతీయ వాదాన్ని తీసుకెళ్లాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్ప‌టికే ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లోని మీడియాతో డీల్ కుదుర్చుకున్నార‌ని వినికిడి. మ‌హారాష్ట్ర‌, బీహార్‌, క‌ర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే రైతుల సంఘాల నేత‌ల‌తో స‌మావేశం అయిన కేసీఆర్ రాబోవు రోజుల్లో వివిధ రంగాల మేధావుల‌తో ప‌లు అంశాల‌పై అధ్య‌య‌నం చేయ‌నున్నారు. ఆయ‌న ప్ర‌య‌త్నాల‌కు జేపీలాంటి వాళ్ల స‌హ‌కారం తీసుకుంటున్నారు. ప్ర‌త్యేకించి ఏపీ బాధ్య‌త‌ల‌ను లోక్ స‌త్తా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జేపీకి పూర్తి స్థాయిలో అప్ప‌గించ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ మేర‌కు వాళ్లిద్ద‌రి మ‌ధ్య సీరియ‌స్ మంత‌నాలు సాగుతున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.